
Virat Anushka: పికిల్‌బాల్ కోర్టులో విరాట్, అనుష్క జంట
ఈ వార్తాకథనం ఏంటి
విరాట్ కోహ్లీ తన 14 ఏళ్ల టెస్ట్ కెరీర్‌కు అధికారికంగా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
123 టెస్ట్ మ్యాచ్‌ల్లో భాగంగా 30 శతకాలు, 31 అర్ధశతకాల సహాయంతో 9,230 పరుగులు నమోదు చేసిన విరాట్, భారత క్రికెట్ చరిత్రలో ఒక చిరస్మరణీయ అధ్యాయంగా నిలిచాడు.
టెస్ట్ కెప్టెన్‌గా 40 విజయాలను అందుకున్న అతను భారత్‌కి నాలుగో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గాను గుర్తింపు పొందాడు.
విరాట్ టెస్ట్ నుంచి రిటైరయ్యే అంశాన్ని బీసీసీఐకి ముందుగానే తెలియజేశాడని తాజా నివేదికలు వెల్లడించాయి.
అయితే ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం అభిమానులను నిరాశకు గురి చేసింది.
Details
ఒత్తిడిని దూరం పెట్టేందుకు పికిల్‌బాల్ ఆటను ఆస్వాదించిన విరాట్
రిటైర్మెంట్ అనంతరం విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి ఉత్తర ప్రదేశంలోని పవిత్ర స్థలం బృందావనాన్ని సందర్శించాడు.
శ్రీకృష్ణ బాల్యం గడిపిన ఈ పుణ్యక్షేత్రంలో వారు ప్రముఖ సంత్ ప్రీమనంద్ గోవింద్ శరణ్ మహారాజ్ ఆశీర్వాదం పొందారు. ఈ సందర్శనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా, IPL 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున విరాట్ కోహ్లీ చక్కటి ప్రదర్శన అందిస్తున్నాడు.
మ్యాచ్‌ల ఒత్తిడిని దూరం పెట్టేందుకు తాజాగా అనుష్క శర్మతో కలిసి అతను పికిల్‌బాల్ ఆటను ఆస్వాదించాడు.
Details
నెట్టింట ఫోటోలు వైరల్
ఈ సరదా సన్నివేశానికి RCB శిబిరంలోని దినేష్ కార్తిక్, దీపికా పల్లికల్ దంపతులు కూడా చేరారు.
"పికిల్‌బాల్ ఫీవర్ మా టీమ్‌ను కుదిపేసిందంటూ RCB అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.