T20 World Cup: విరాట్ కోహ్లీ-అర్ష్‌దీప్ భాంగ్రా డ్యాన్స్ అదుర్స్
Virat kohli- Arshdeep singh dance video: టీ20 ప్రపంచకప్‌లో టీం ఇండియా ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్‌గా మారాయి. ముఖ్యంగా టీమిండియా ఆటగాళ్లు తమ ఆనందాన్ని వ్యక్తం చేసే ఏ అవకాశాన్ని వదలడం లేదు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ, అర్ష్‌దీప్ వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఈ ఇద్దరు బార్బడోస్‌లో చేసిన భాంగ్రా డ్యాన్స్ అదుర్స్ అనిపించింది. ఈ వీడియోలో రింకూ సింగ్, మహ్మద్ సిరాజ్, ఖలీల్ అహ్మద్ వంటి చాలా మంది ఆటగాళ్ళు కూడా ఉన్నారు. విరాట్ కోహ్లీ, అర్ష్‌దీప్ సింగ్ దిలేర్ మెహందీలోని సూపర్ హిట్ పాట 'తునక్ తునక్'పై డ్యాన్స్ చేసి.. అదుర్స్ అనిపించారు.