రికార్డుల మోత మోగించిన కింగ్ విరాట్ కోహ్లీ
శ్రీలంకతో జరిగిన 50వ వన్డేలో విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీని నమోదు చేశాడు. శ్రీలంక జట్టుపై 10 వన్డే సెంచరీలు బాదిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా కోహ్లీకి ఇది 74 ఇంటర్నేషనల్ సెంచరీ. సచిన్ 100 సెంచరీలతో ఈ జాబితాలో ముందున్నాడు. అనంతరం జయవర్ధనే పరుగుల రికార్డును కోహ్లీ అధిగమించాడు. ప్రస్తుతం వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లీ 5వ స్థానంలో నిలిచాడు. శ్రీలంకతో మొదటిసారిగా 150 ప్లస్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. వన్డే రికార్డులో కోహ్లికి ఇది రెండో అత్యధిక స్కోరు. 2012 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన 183 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
వన్డేలో అత్యధిక సెంచరీలు నమోదు
268 వన్డే మ్యాచ్ ల్లో కోహ్లీ ఇప్పటివరకూ 12,754 పరుగులు సాధించాడు. వన్డేలో 46 సెంచరీలు నమోదు చేయగా.. టెండూల్కర్ (49) సెంచరీలు చేసి మొదటి స్థానంలో నిలిచాడు. కోహ్లి ఇప్పుటి స్వదేశంలో 104 మ్యాచ్‌లు ఆడి 21 సెంచరీలు నమోదు చేశాడు. ఇప్పటివరకు 20 సెంచరీలు చేసిన టెండుల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుతం కోహ్లీ 268 వన్డేల్లో 12,754 పరుగులలు చేశాడు. సచిన్ కంటే 5,672 పరుగుల దూరంలో ఉన్నాడు. మరో నాలుగేళ్ల పాటు క్రికెట్ ఆడే అవకాశం ఉంది. ఈ క్రమంలో సచిన్ రికార్డును బ్రేక్ చేస్తాడో లేదో వేచిచూడాలి