టీ20ల్లో చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. ఒకే స్టేడియంలో 3వేల పరుగులు
ఈ వార్తాకథనం ఏంటి
రికార్డుల రారాజు, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ టీ20 చరిత్రలో రికార్డు సృష్టించాడు.
చిన్నస్వామి వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ ఆరుదైన ఫీట్ ను సాధించాడు. టీ20 చరిత్రలో ఒకే స్టేడియం వేదికగా 3వేల పరుగుల సాధించిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.
ఆర్సీబీకి హోం గ్రౌండ్ అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీ 3వేల పరుగులు పూర్తి చేసుకోవడం విశేషం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి విరాట్ కోహ్లీ ఆర్సీబీకే ఆడుతున్నాడు.
ఇక ఈ మ్యాచ్ లో 37 బంతుల్లో 6 ఫోర్లతో 54 పరుగులు చేసి.. చిన్నస్వామి స్టేడియంలో రికార్డును నెలకొల్పాడు.
Details
విరాట్ కోహ్లీ మరో రికార్డు
దీంతో పాటు విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో మరో రికార్డును సాధించడం విశేషం. ఐపీఎల్ లో కేకేఆర్ పై అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు.
కేకేఆర్ పై డేవిడ్ వార్నర్ 1075 పరుగులు చేసి తొలి స్థానంలో ఉండగా.. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ 1040 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు.
తాజాగా విరాట్ కోహ్లీ 858 పరుగులు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ 850 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆర్సీబీపై కేకేఆర్ 21 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే