ఐపీఎల్‌లో చరిత్రలోనే అతి చెత్త రికార్డు నమోదు
చిన్నస్వామి వేదికగా జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ పై కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 200 పరుగల భారీ స్కోరును చేసింది. లక్ష్య చేధనలో ఆర్సీబీ బ్యాటర్లు తడబడటంతో.. 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. దీంతో ఆర్సీబీ 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 200 అంతకంటే ఎక్కువ స్కోర్లు సమర్పించుకున్న జట్టుగా రికార్డులోకెక్కింది.
చెత్త రికార్డును మూటగట్టుకున్న ఆర్సీబీ
ఆర్సీబీ ఇప్పటివరకూ ప్రత్యర్ధి జట్లు 24 సార్లు పైగా 200 ప్లస్ స్కోరును సాధించారు. పంజాబ్ కింగ్స్ (23), కేకేఆర్ (18), చైన్నై సూపర్ కింగ్స్ (17), రాజస్థాన్ రాయల్స్ (14), సన్ రైజర్స్ హైదరాబాద్ (14), ముంబై ఇండియన్స్ (11) సందర్బాల్లో ప్రత్యర్థులను 200 కంటే ఎక్కువ స్కోరును ఇచ్చిన జట్లుగా నిలిచాయి. నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే జేసన్ రాయ్ 59(24), నితీశ్ రాణా 48(21) విజృంభించి ఆడటంతో కేకేఆర్ 200 పరుగులను చేసింది. వరుణ్ చక్రవర్తి 3, సుయాశ్ శర్మ, అండ్రీ రస్సెల్ తలా రెండు వికెట్లు పడగొట్టి కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించారు.