Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఫిల్ సాల్ట్‌తో కలిసి ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కోహ్లి, ముంబై బౌలర్లపై బౌండరీల వర్షం కురిపించాడు. మొదట దూకుడుగా ఆడిన విరాట్ కోహ్లి, మధ్య ఓవర్లలో కొంత నెమ్మదిగా ఆడాడు. అయినప్పటికీ ఫిల్ సాల్ట్‌తో కలిసి తొలి వికెట్‌కు భారీగా 124 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. మొత్తం 38 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 5ఫోర్లు, 1సిక్సర్‌తో 50 పరుగులు చేసి హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌తో కోహ్లి తన పేరుపై పలు అరుదైన రికార్డులను లిఖించుకున్నాడు.
వివరాలు
కోహ్లి సాధించిన రికార్డులివే
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌పై 1000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతేకాక ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్‌పై 1000కి పైగా పరుగులు సాధించిన ఘనత కూడా అతనిదే. అదేవిధంగా టీ20 క్రికెట్‌లో అత్యధిక 100+ భాగస్వామ్యాలు నెలకొల్పిన ఆటగాడిగా కోహ్లి ప్రపంచ రికార్డు సాధించాడు. ఈ క్రమంలో క్రిస్ గేల్ (29), బాబర్ ఆజమ్ (28) వంటి స్టార్ బ్యాటర్లను అధిగమించి కోహ్లి అగ్రస్థానంలో నిలిచాడు.