Page Loader
Virat Kohli : విరాట్ కోహ్లీకి గిఫ్ట్‌గా డైమండ్ బ్యాట్..ధర ఎంతంటే..?
విరాట్ కోహ్లీకి గిఫ్ట్‌గా డైమండ్ బ్యాట్..ధర ఎంతంటే..?

Virat Kohli : విరాట్ కోహ్లీకి గిఫ్ట్‌గా డైమండ్ బ్యాట్..ధర ఎంతంటే..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 19, 2023
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగాచ చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో కూడా అత్యధిక ఫాలోవర్లను సాధించి టాప్‌లో కొనసాగుతున్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా కింగ్ కోహ్లీపై ఏదో రూపంలో ఇష్టాన్ని చూపించడానికి అభిమానులు ప్రయత్నిస్తుంటారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సూరత్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త అదిరిపోయే గిప్ట్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. కోహ్లీకి 1.04 క్యారెట్ డైమండ్ బ్యాట్‌ను కింగ్ కోహ్లీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నానని, దాని విలు రూ.10 లక్షలు ఉంటుందన్నారు.

Details

వ్యాపారవేత్త కోహ్లీకి వీరాభిమాని

డైమండ్ బ్యాట్ 15 మిల్లీమీటర్ల పొడవు, 5 మిల్లీమీటర్ల వెడల్పుతో ఉండనుంది. డైమండ్ టెక్నాలజీ నిపుణుడు, లెక్సస్ సాప్ట్‌మాక్ కంపెనీ డైరక్టర్ ఉత్పల్ మిస్త్రీ ఈ బ్యాట్ తయారీ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. కోహ్లీకి బహుమతి ఇవ్వాలనుకున్న వ్యాపారవేత్త, కోహ్లీకి వీర అభిమాని అని, చాలా ఏళ్లుగా కోహ్లీని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆసియా కప్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఆగస్టు 30 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్‌లో భారత్ తొలి మ్యాచును పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 2 ప్రారంభం కానుంది.