రోనాల్డ్ కంటే విరాట్ తక్కువేం కాదు : పాక్ మాజీ కెప్టెన్
విరాట్ కోహ్లీ 14 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో ఎన్నో తిరుగులేని రికార్డులను సాధించాడు. ప్రస్తుతం ఈ తరంలో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్ గా టాప్ లో ఉన్నాడు. ఆదివారం శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో 110 బంతుల్లో 166 పరుగులతో అజేయంగా నిలిచాడు. దాదాపు మూడు గంటల పాటు క్రీజులో పాతుకుపోయిన కోహ్లీ ఏ దశలోనూ అలసిపోయినట్లు కనిపించలేదు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ కోహ్లీ ఫిట్‌నెస్‌పై కొన్ని వ్యాఖ్యలు చేశాడు. స్టార్ పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో కంటే విరాట్ కోహ్లీ తక్కువ కాదని సల్మాన్ బట్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఫిటెనెస్ బాగా ఉన్న ఆటగాళ్లలో కోహ్లీ ఒకరన్నారు.
టీమిండియా విజయాల్లో కోహ్లీ కీలక పాత్ర
విరాట్ కోహ్లీ అత్యుత్తమ స్థాయికి చేరుకొని ఇంకా సెంచరీలు చేసే అవకాశం ఉందని పాక్ మాజీ కెప్టెన్ సల్మన్ భట్ తెలిపారు. భవిష్యత్తులో మరింత మెరుగ్గా రాణించి టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తారన్నారు. 2022 నుంచి తన ఫామ్ కోసం కష్టపడుతున్న కోహ్లి.. ఆసియా కప్ నుంచి గాడిలో పడ్డాడు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన వన్డే సిరీస్‌లో కోహ్లీ రెండు సెంచరీలు చేసి, టీమిండియా విజయంలో భాగస్వామ్యం అయ్యాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో 283 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యారు.