Page Loader
విరాట్ నీది మరో లెవల్ ఇన్నింగ్స్ : ఏబీ డివిలియర్స్
విరాట్ ఆటకు సోషల్ మీడియాలో పోగడ్తల వర్షం

విరాట్ నీది మరో లెవల్ ఇన్నింగ్స్ : ఏబీ డివిలియర్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 16, 2023
06:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించి రికార్డులను బద్దలు కొట్టింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు 317 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. వన్డే ఫార్మెట్లో ఏ జట్టు చేయని అతిపెద్ద విజయాన్ని టీమిండియా నమోదు చేసింది. స్టార్ ఇండియా బ్యాటర్ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ చూసి అభిమానులు ఫిదా అయ్యారు. 166 పరుగులతో అజేయంగా నిలిచి సత్తా చాటాడు. వన్డే సిరీస్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా విరాట్‌ కోహ్లి నిలిచాడు కోహ్లీ ఆటను చూసిన అభిమానులు, మాజీక్రికెటర్లు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మాజీ ఐపీఎల్ సహచరుడు ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ'నీది మరో లెవల్' అని ట్వీట్ చేశాడు

విరాట్ కోహ్లీ

విరాట్ ఇన్నింగ్స్‌కు అభిమానులు ఫిదా

వెటరన్ టీమిండియా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్, డివిలియర్స్ పోస్ట్‌ను రీట్వీట్ చేస్తూ, ఇది వేరే లెవెల్ ఇన్నింగ్స్ అని, మళ్లీ ఐపీఎల్‌లో కలుద్దామని ట్వీట్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అయింది. విరాట్ కోహ్లీ, డివిలియర్స్ చాలా సంవత్సరాలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున కలిసి ఆడారు. జట్టు కోసం ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడారు. మూడేళ్లుగా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో సెంచరీ చేయక విమర్శలు ఎదుర్కొన్న విరాట్‌.. గతేడాది ఆసియా కప్‌ నుంచి గాడిలో పడ్డాడు. ఆ టోర్నీలో టీ20ల్లో తొలి సెంచరీ చేసిన విరాట్‌.. తర్వాత బంగ్లాదేశ్‌ టూర్‌లో టెస్టుల్లో, వన్డేల్లో.. ఇప్పుడు శ్రీలంకతో వన్డే సిరీస్‌లోనూ సెంచరీల మోత మోగించడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.