Loading...
Virat Kohli: చరిత్ర తిరగరాసిన విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్ గడ్డపై ఎవరికీ సాధ్యం కాని రికార్డు!
చరిత్ర తిరగరాసిన విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్ గడ్డపై ఎవరికీ సాధ్యం కాని రికార్డు!

Virat Kohli: చరిత్ర తిరగరాసిన విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్ గడ్డపై ఎవరికీ సాధ్యం కాని రికార్డు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 17, 2026
10:32 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్ బ్యాటర్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ తన ఖాతాలో మరో అరుదైన ఘనతను నమోదు చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో (టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి) ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. కార్డిఫ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో వ్యక్తిగతంగా నాలుగు పరుగులు చేసిన వెంటనే ఈ రికార్డును అందుకున్నాడు. ఈ క్రమంలో భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. రాహుల్ ద్రవిడ్ ఇంగ్లండ్‌లో 46 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 2,645 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 59 మ్యాచ్‌ల్లో 2,707 పరుగులు చేసి అగ్రస్థానానికి చేరుకున్నాడు.

వివరాలు

65  పరుగులతో రాణించిన కోహ్లీ

ఈ జాబితాలో కోహ్లీ, ద్రవిడ్ తర్వాత సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోని ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో కోహ్లీ 66 బంతులు ఎదుర్కొని 8 ఫోర్ల సాయంతో 65 పరుగులు చేసి జట్టు స్కోరుకు కీలకంగా తోడ్పడ్డాడు.

వివరాలు

ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు

విరాట్ కోహ్లీ - 59 మ్యాచ్‌లు, 2707 పరుగులు

రాహుల్ ద్రవిడ్ - 46 మ్యాచ్‌లు, 2645 పరుగులు

సచిన్ టెండూల్కర్ - 43 మ్యాచ్‌లు, 2626 పరుగులు

రోహిత్ శర్మ - 48 మ్యాచ్‌లు, 2308 పరుగులు

సౌరవ్ గంగూలీ - 36 మ్యాచ్‌లు, 1949 పరుగులు

ఎంఎస్ ధోని - 60 మ్యాచ్‌లు, 1869 పరుగులు

ADVERTISEMENT

వివరాలు

ఇంగ్లండ్‌పై మరో రికార్డు కూడా కోహ్లీదే

ఈ మ్యాచ్‌లో అర్ధశతకం నమోదు చేసిన కోహ్లీ, ఇంగ్లండ్‌పై అత్యధిక సార్లు 50కు పైగా స్కోరు చేసిన భారత బ్యాటర్‌గా కూడా నిలిచాడు.

ఈ సందర్భంగా మరో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు.

సచిన్ టెండూల్కర్ ఇంగ్లండ్‌పై అన్ని ఫార్మాట్లలో కలిపి 32 సార్లు 50కిపైగా స్కోర్లు నమోదు చేయగా, తాజా అర్ధశతకంతో విరాట్ కోహ్లీ ఆ సంఖ్యను 33కు పెంచి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

ADVERTISEMENT

వివరాలు

ఇంగ్లండ్‌పై అత్యధిక 50+ స్కోర్లు చేసిన భారత ఆటగాళ్లు

విరాట్ కోహ్లీ - 33 సార్లు

సచిన్ టెండూల్కర్ - 32 సార్లు

రాహుల్ ద్రవిడ్ - 26 సార్లు

ఎంఎస్ ధోని - 24 సార్లు

సునీల్ గవాస్కర్ - 23 సార్లు

ఇలా ఒకే మ్యాచ్‌లో రెండు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్న విరాట్ కోహ్లీ, మరోసారి తన స్థిరమైన ఆటతీరుతో భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని మరింత బలపరిచాడు.

ADVERTISEMENT