WAPL: 19 నుంచి డబ్ల్యూఏపీఎల్.. మహిళా క్రికెటర్లకు కొత్త వేదిక!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లోని మహిళా క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రారంభించిన మహిళా ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూఏపీఎల్) తొలి సీజన్‌కు రంగం సిద్ధమైంది. నాలుగు జట్లు పాల్గొంటున్న ఈ లీగ్‌లో అమరావతి ఈ ఛాంపియన్స్, రాయలసీమ జెన్ స్టార్స్, గోదావరి గోల్డెన్ ఈగల్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ బరిలో నిలిచాయి. మంగళగిరిలోని ఏసీఏ స్టేడియం వేదికగా ఈ నెల 19 నుంచి 27 వరకు తొమ్మిది రోజుల పాటు మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు మిగతా మూడు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. లీగ్ దశ ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన జట్లు ఈ నెల 27న ఫైనల్‌లో తలపడతాయి.
వివరాలు
ఏసీఏ ప్రత్యేక ఏర్పాట్లు
ఈ నెల 19, 20, 21, 23, 24, 25 తేదీల్లో రోజుకు రెండు చొప్పున లీగ్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు.
భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ సారథి మిథాలీరాజ్ ఈ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు.
తొలి రోజు మధ్యాహ్నం జరిగే ఆరంభ మ్యాచ్‌లో రాయలసీమ జెన్ స్టార్స్, గోదావరి గోల్డెన్ ఈగల్స్ తలపడనున్నాయి.
అదే రోజు సాయంత్రం జరిగే మ్యాచ్‌లో అమరావతి ఈ ఛాంపియన్స్.. వైజాగ్ ఫైర్ బర్డ్స్‌తో పోటీ పడనుంది.
డబ్ల్యూఏపీఎల్ ప్రారంభ వేడుకలను సినీ, క్రికెట్, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులతో ఘనంగా నిర్వహించేందుకు ఏసీఏ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.