Sanjay Manjrekar-Murali: లైవ్ టీవీలో మంజ్రేకర్-మురళీ కార్తిక్ మాటల యుద్ధం.. వైరల్‌గా కౌంటర్లు!
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు సందర్భంగా లైవ్ కామెంట్రీ బాక్స్, స్టూడియో మధ్య జరిగిన సరదా సంభాషణ కాస్తా వాడివేడి చర్చగా మారింది. భారత మాజీ క్రికెటర్లు సంజయ్ మంజ్రేకర్, మురళీ కార్తిక్ ఆన్-ఎయిర్‌లో ఒకరిపై ఒకరు వేసుకున్న కౌంటర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎక్స్‌ప్రెషన్స్‌పై కార్తిక్ కామెంట్ టెస్టు మ్యాచ్ లంచ్ బ్రేక్ సమయంలో ఈ సరదా సంభాషణ మొదలైంది. స్టూడియోలో ఉన్న మురళీ కార్తిక్.. మైదానం నుంచి మాట్లాడుతున్న సంజయ్ మంజ్రేకర్ ముఖకవళికలపై కామెంట్ చేశారు. మీరు పెట్టే ఎక్స్‌ప్రెషన్స్ వల్ల ఒక్కోసారి మీరు ఏం మాట్లాడుతున్నారో సరిగ్గా అర్థం కావడం లేదు. కాస్త వాటిని తగ్గించండి'' అంటూ కార్తిక్ సరదాగా వ్యాఖ్యానించారు.
వివరాలు
రహానేతో పోల్చిన మంజ్రేకర్
కార్తిక్ వ్యాఖ్యలపై మంజ్రేకర్ వెంటనే కౌంటర్ ఇచ్చారు. 'కెమెరాను నా నుంచి స్ప్లిట్ స్క్రీన్ చేసి పక్కనే ఉన్న అజింక్య రహానే వైపు తిప్పండి. ఆయన ముఖం చూడటానికి చాలా బాగుంటుంది.
మాట్లాడటానికి కూడా మంచి వ్యక్తి అంటూ సెటైర్ వేశారు.
అంతటితో ఆగకుండా.. మురళీ కార్తిక్ అద్దంలో చూసుకుంటూ తనను తాను చూసి మురిసిపోతుంటారని మంజ్రేకర్ ఎద్దేవా చేశారు.
వివరాలు
'అది మీ అలవాటే'..
మంజ్రేకర్ వ్యాఖ్యలకు మురళీ కార్తిక్ కూడా వెంటనే బదులిచ్చారు.
''నేను అద్దంలో చూసుకోను.. అది మీ అలవాటే'' అంటూ రీకౌంటర్ ఇచ్చారు. దీంతో లైవ్ షోలో వాతావరణం కాస్త సీరియస్‌గా మారుతున్నట్లు కనిపించింది.
అయితే పరిస్థితి మరింత ముదరకుండా మంజ్రేకర్ స్వయంగా చమత్కారంగా స్పందించారు.
మనం హద్దులు దాటి మాట్లాడుకుంటే సోషల్ మీడియాకు మంచి కంటెంట్ దొరుకుతుందంటూ నవ్వుతూ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణకు సంబంధించిన వీడియో, వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.