Virat Kohli Instagram controversy: కోహ్లీని టార్గెట్ చేశారా..? జర్మన్ మోడల్ సంచలన ఆరోపణలు!
ఈ వార్తాకథనం ఏంటి
సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయిన విరాట్ కోహ్లీ-లిజ్ లాజ్ వివాదంపై తాజాగా మరో ఆసక్తికర మలుపు చోటుచేసుకుంది. కొద్దిరోజుల క్రితం లిజ్ లాజ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను విరాట్ కోహ్లీ లైక్ చేశారంటూ స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చించుకున్నారు. ఈ చిన్న విషయాన్ని ఆధారంగా చేసుకుని కోహ్లీ ప్రతిష్టను దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నించారని లిజ్ లాజ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వివాదంపై స్పందిస్తూ పలు కీలక విషయాలను వెల్లడించారు.
వివరాలు
కోహ్లీ ఆసియాకు మెస్సీ, రొనాల్డో లాంటి వ్యక్తి
విరాట్ కోహ్లీపై వస్తున్న విమర్శలను లిజ్ లాజ్ ఖండించారు. కోహ్లీ ఆసియా ఖండానికి లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో లాంటి వారు. అలాంటి గొప్ప క్రీడాకారుడిపై బురద చల్లడం సరైంది కాదని పేర్కొన్నారు. కేవలం ఒక సోషల్ మీడియా 'లైక్'ను పెద్ద వివాదంగా మలచడం అనవసరమని, కోహ్లీ ఎప్పుడూ అసభ్యంగా ప్రవర్తించలేదని ఆమె స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తాను కూడా అనవసరంగా లాగబడ్డానని తెలిపారు.
వివరాలు
వివాదం వెనుక కుట్ర?
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆటగాడిని టార్గెట్ చేస్తూ, డబ్బుతో నోరు నొక్కే ప్రయత్నాలు జరిగాయనే అనుమానాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ వివాదం తర్వాత లిజ్ లాజ్‌కు భారత్‌లో ఊహించని స్థాయిలో గుర్తింపు లభించినట్లు సమాచారం. పలు బ్రాండ్ ఎండోర్స్‌మెంట్ ఆఫర్లు, రియాలిటీ షో అవకాశాలు కూడా ఆమెకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఎంత గుర్తింపు వచ్చినా, తన వ్యక్తిగత విలువలు మరియు సూత్రాలకు కట్టుబడి ఉంటానని లిజ్ లాజ్ స్పష్టం చేశారు.