LOADING...
IND vs ENG : వర్షం వల్ల ఇండియా-ఇంగ్లాండ్ సెమీఫైనల్ రద్దైతే ఫైనల్‌కు ఎవరు? ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే?
ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

IND vs ENG : వర్షం వల్ల ఇండియా-ఇంగ్లాండ్ సెమీఫైనల్ రద్దైతే ఫైనల్‌కు ఎవరు? ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 05, 2026
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్ 2026లో మరో కీలక పోరుకు వేదిక సిద్ధమైంది. గురువారం (ఫిబ్రవరి 5) ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుంది. ఫైనల్‌లోకి అడుగుపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ రెండు జట్లు ఈ మ్యాచ్‌లో విజయం కోసం పోటీ పడుతున్నాయి. ఇక బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ విజయం సాధించి ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం (మార్చి 8) జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు ప్రత్యర్థిగా నిలిచేది భారత్ లేదా ఇంగ్లాండ్ అనే విషయం మరికొన్ని గంటల్లో స్పష్టమవుతుంది.

వివరాలు 

మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయితే ప‌రిస్థితి ఏంటి?

టీ20 ప్రపంచకప్ 2026లో ఇప్పటికే కొన్ని మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో సెమీ ఫైన‌ల్ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయితే ప‌రిస్థితి ఏంటి? అన్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. మ్యాచ్ రద్దయితే భారత్, ఇంగ్లాండ్ జట్లలో ఏ జట్టు ఫైనల్‌కు చేరుకుంటుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ విషయంలో ఐసీసీ నిబంధనలు ఏమంటున్నాయో ఒకసారి చూద్దాం.

వివరాలు 

కనీసం 10 ఓవర్లు ఆడాల్సిందే..

సాధారణంగా వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడితే ఓవర్ల సంఖ్యను తగ్గించి మ్యాచ్‌ను కొనసాగించడం చూస్తుంటాం. టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశలో మ్యాచ్ ఫలితం రావాలంటే రెండు జట్లు కనీసం ఐదు ఓవర్లు చొప్పున ఆడాలి. అయితే నాకౌట్ దశలో మాత్రం ఇరు జట్లు కనీసం 10 ఓవర్లు ఆడాల్సిందే అని ఐసీసీ నిబంధనలు చెబుతున్నాయి. గ్రూప్ దశ,సూపర్-8 దశలో జరిగే మ్యాచ్‌లకు ఐసీసీ రిజర్వ్ డేలను కేటాయించలేదు. కానీ సెమీఫైనల్ మరియు ఫైనల్ మ్యాచ్‌లకు మాత్రం రిజర్వ్ డేలు ఏర్పాటు చేసింది. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ పూర్తిచేయడం సాధ్యంకాకపోతే, మరుసటి రోజు రిజర్వ్ డేలో మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంటుంది.

Advertisement

వివరాలు 

కనీసం 10 ఓవర్లు ఆడాల్సిందే..

నాకౌట్ మ్యాచ్‌ల్లో వర్షం వల్ల మ్యాచ్ నిర్ణీత సమయానికి పూర్తికాకపోతే అదనంగా 90 నిమిషాల సమయం ఇవ్వబడుతుంది. ఈ అదనపు సమయంలో కూడా మ్యాచ్ పూర్తి చేయడం సాధ్యంకాకపోతే, రిజర్వ్ డేలో మ్యాచ్‌ను కొనసాగిస్తారు. అయితే మొదటి రోజు మ్యాచ్ ఎక్కడ ఆగిపోయిందో, అదే స్థితి నుంచి రిజర్వ్ డే రోజున మ్యాచ్ మళ్లీ ప్రారంభమవుతుంది.

Advertisement

వివరాలు 

మ్యాచ్ రద్దైతే..

షెడ్యూల్ చేసిన రోజుతో పాటు రిజర్వ్ డే రోజున కూడా మ్యాచ్ నిర్వహించడం అసాధ్యమైతే మాత్రమే అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తారు. అలాంటి పరిస్థితిలో సూపర్-8 దశలో మెరుగైన ప్రదర్శన చేసిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. సూపర్-8 దశలో గ్రూప్-2 నుంచి ఇంగ్లాండ్ జట్టు అగ్రస్థానంతో సెమీఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు భారత్ గ్రూప్-1లో రెండో స్థానంతో సెమీస్‌కు అర్హత సాధించింది. అందువల్ల వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఐసీసీ నిబంధనల ప్రకారం ఇంగ్లాండ్ జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఆ పరిస్థితిలో భారత్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది.

Advertisement