Shubham Dudey: బ్యాట్ కొనుక్కోలేని క్రికెటర్.. ఐపీఎల్ వేలంతో కోటీశ్వరుడయ్యాడు!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ వేలం నిరుపేద క్రికెటర్లపై డబ్బుల వర్షం కురిపిస్తోంది. మంగళవారం ముగిసిన వేలం పలువురు అనామక క్రికెటర్లను కోటీశ్వరులను చేసింది.
ప్రతి సీజన్ లోనూ ఫ్రాంచైజీలు సాధారణ క్రికెటర్లను కోటీశ్వరులను చేసినట్టే ఈ సీజన్‌లో కూడా కొందరు ఆటగాళ్లకు జాక్ పాట్ తగిలింది.
తాజాగా ఐపీఎల్(IPL) వేలంలో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) శుభమ్ దూబే (Shubham Dudey)ని రూ. 5.8 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది.
నాగపూర్ కు చెందిన శుభమ్, దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు.
తండ్రి బద్రీప్రసాద్ దూబే పాన్ షాప్ ను నిర్వహించేవాడు. చిన్నప్పటి నుంచి శుభమ్ కు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం.
Details
కోచ్ సుదీప్ సాయం మరువలేనిది : శుభమ్ దూబే
విదర్భ మాజీ ఆటగాడు సుదీప్ జైస్వాల్ పరిచయం కావడం దూబే కెరీర్‌ను మలుపు తిప్పింది. శుభమ్ ఆర్థిక పరిస్థితిని చూసి సుదీప్ కిట్ అందించాడు.
విదర్భ అండర్-19, అండర్-23 జట్లలో చోటు దక్కించుకున్న శుభమ్.. అద్భుత ప్రదర్శనతో సీనియర్ జట్టులోకి వచ్చాడు.
ఈ ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లో 7 మ్యాచుల్లో 222 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో తనకు దక్కిన భారీ ధరపై దూబే స్పందించాడు.
తాను నమ్మలేకపోతున్నానని, తనకు ఎంపికకు కోచ్ సుదీప్ చాలా సాయం చేశాడని పేర్కొన్నాడు.
ఆయన లేకుంటే తాను క్రికెట్ టోమ్ లోకి వచ్చేవాడినే కాదంటూ దూబే ఎమోషనల్ అయ్యాడు.