ICC : ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయిన భారత ప్లేయర్ ఎవరంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోసం ఈ ఏడాది నామినేట్ అయిన ఆటగాళ్లను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.
2024లో టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన నాలుగు ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేసింది. భారత యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం.
ఇతర నామినేషన్లలో జింబాబ్వే ఆల్‌రౌండర్ సికిందర్ రజా, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్, ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఉన్నారు.
అయితే ఈ ఏడాది టీ20ల్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన హార్దిక్ పాండ్య, జస్పిత్ బుమ్రా లాంటి స్టార్ ఆటగాళ్లు నామినేట్ కాలేదు.
Details
మహిళల విభాగంలో ఆటపట్టు ఎంపిక
అర్ష్‌దీప్ సింగ్ మాత్రం ఈ ఏడాది టెస్టు ఆడే దేశాల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 18 మ్యాచ్‌ల్లో 36 వికెట్లు తీసి తన ప్రతిభను నిరూపించుకున్నాడు.
ట్రావిస్ హెడ్ 15 ఇన్నింగ్స్‌లలో 38.50 సగటుతో 539 పరుగులు సాధించాడు. మరోవైపు సికిందర్ రజా 573 పరుగులతో పాటు 24 వికెట్లు కూడా తీసి అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చాడు.
మహిళల విభాగంలో కూడా ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోసం నామినేషన్లు ప్రకటించారు.
శ్రీలంక క్రికెటర్ చమరి ఆటపట్టు, న్యూజిలాండ్ ఆటగాడు మెలీ కెర్, దక్షిణాఫ్రికా ఆటగాడు లారా వోల్వార్డ్ట్, ఐర్లాండ్ క్రికెటర్ ఓర్లా ప్రెండర్‌గాస్ట్ ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు.