Page Loader
ఫిఫా అవార్డులలో రోనాల్డ్ ఓటు వేయకపోవడానికి కారణం ఇదేనా..?

ఫిఫా అవార్డులలో రోనాల్డ్ ఓటు వేయకపోవడానికి కారణం ఇదేనా..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 01, 2023
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డ్ సౌదీ ప్రొ లీగ్‌లో ఆడుతున్నాడు. గతేడాది ఖతార్‌లో ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్‌కి నాయకత్వం వహించాడు. మాంచెస్టర్ యునైటెడ్‌ తెగదెంపులు చేసుకున్న అనంతరం.. రొనాల్డ్ దుబాయ్‌కు చెందిన అల్‌నజర్ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పారిస్‌ వేదికగా ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ ది ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌(FIFA) నిర్వహించిన బెస్ట్‌ ఫిఫా ఫుట్‌బాల్‌ అవార్డ్స్‌లో బెస్ట్‌ ప్లేయర్‌ అవార్డును మెస్సీ కైవసం చేసుకున్నాడు. పీపీ పీఎస్జీ స్టార్ కైలియన్ ఎంబాప్పే పురుషుల ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఓటు వేశారు. మాజీ రియల్ మాడ్రిడ్ డిఫెండర్ మొదటి మూడు స్థానాలకు మెస్సీని ఎంపిక చేయలేదు. బదులుగా మాడ్రిడ్ మాజీ సహచరులు లూకామోడ్రిక్, కరీమ్‌బెంజెమా వరుసగా రెండు, మూడో స్థానంలో నిలిచారు.

రోనాల్డ్‌

రోనాల్డ్‌ని అభ్యర్థిగా ప్రకటించలేదు

అర్జెంటీనా కెప్టెన్‌గా, మెస్సీకి ఓటు వేయడానికి అనుమతి లభించింది. రెండో స్థానంలో నిలిచిన ఎంబాప్పే నెయ్‌మార్‌ను తన మొదటి ఎంపికగా ఎంచుకున్నాడు. ప్రపంచ కప్ సమయంలో పోర్చుగల్‌ రోనాల్డ్‌ని పక్కన పెట్టింది. రోనాల్డ్ రెండు సార్లు FIFA అవార్డును గెలుచుకున్నాడు. అయితే తొలిసారిగా ఫిఫా నియమించిన నిపుణుల బృందం రోనాల్డ్‌ని అభ్యర్థిగా పరిగణించకపోవడం గమనార్హం. రొనాల్డో ఈసారి ఫీఫా అవార్డ్స్‌కి నామినేట్ కాకపోవడంతో స్వంతంగా ఓటును వేయడానికి అనర్హుడయ్యాడు.