Page Loader
బార్సిలోనాను ఓడించిన మాంచెస్టర్ యునైటెడ్
బార్సిలోనాను ఓడించిన మాంచెస్టర్ సిటీ

బార్సిలోనాను ఓడించిన మాంచెస్టర్ యునైటెడ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 24, 2023
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

UEFA యూరోపా లీగ్ ప్లే ఆప్ టై లో బార్సిలోనాపై మాంచెస్టర్ యునైటెడ్ విజయం సాధించింది. 2-1 తేడాతో బోర్సాలోనాను మంచెస్టర్ యునైటెడ్ ఓడించింది. మొదటి లెగ్‌లో 2-2తో డ్రా అయిన తర్వాత, రాబర్ట్ లెవాండోస్కీ పెనాల్టీ గోల్ చేయడంతో బార్సిలోనా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండవ అర్ధభాగంలో ఫ్రెడ్, ఆంటోనీ గోల్స్ చేయడంతో యునైటెడ్ 4-3 అధిక్యంతో విజయం సాధించింది. దీంతో మాంచెస్టర్ యునైటెడ్ 16వ రౌండ్‌కు చేరుకుంది. మాంచెస్టర్ యునైటెడ్ ఈ సీజన్‌లో అన్ని పోటీలలో 19 గోల్స్ చేసింది. ఇది 2022-23లో యూరోపియన్ లీగ్ జట్టులో ఎక్కువ కావడం గమనార్హం. యునైటెడ్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో తమ చివరి 18 మ్యాచ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ అజేయంగా నిలిచింది.

మాంచెస్టర్ యూనైటెడ్

ప్రెడ్ ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు గోల్స్ చేశాడు

మాంచెస్టర్ యునైటెడ్ కోసం ఫ్రెడ్ తన చివరి ఎనిమిది మ్యాచ్‌లో ఆరు గోల్స్‌ సాధించాడు. ఈ సీజన్‌లో 34 మ్యాచ్‌లు ఆడిన అతను ఐదు గోల్స్ చేశాడు. లెవాండోవ్స్కీ తన క్లబ్ కెరీర్‌లోని చివరి 12 సీజన్‌లలో 25 కన్నా ఎక్కువ గోల్స్ చేశాడు. ఈ సీజన్‌లో బార్కా తరపున 30 మ్యాచ్‌లు ఆడిన అతను 25 గోల్స్ చేయడం విశేషం. బ్రూనో ఫెర్నాండెజ్ అలెజాండ్రో బాల్డేను ఫౌల్ చేయడంతో లెవాండోస్కీ పెనాల్టీని గోల్ చేశాడు. ఆంటోనీ 73వ నిమిషంలో 15 గజాల నుండి అద్భుతంగా గోల్ చేశాడు. మ్యాన్ యునైటెడ్ 2008 తర్వాత మొదటిసారి బార్కాను ఓడించింది.