Loading...
Ashish Nehra: భార్య అనుమతి తప్పనిసరి.. లేదంటే విడాకులే: ఆశిశ్‌ నెహ్రా
భార్య అనుమతి తప్పనిసరి.. లేదంటే విడాకులే: ఆశిశ్‌ నెహ్రా

Ashish Nehra: భార్య అనుమతి తప్పనిసరి.. లేదంటే విడాకులే: ఆశిశ్‌ నెహ్రా

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 08, 2026
11:28 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత జట్టు ప్రస్తుత ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ (Gambhir)పై కొంతకాలంగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. జట్టు ఎంపికలో కొందరు ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఎంపికైన వారిలో కొందరికి ఒక్కసారి కూడా తుది జట్టులో అవకాశం కల్పించకపోవడం, ఆటగాళ్ల స్థానాలను తరచూ మార్చడం వంటి అంశాలపై గంభీర్‌ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దీంతో అతడిని టీమ్‌ఇండియా కోచ్‌ బాధ్యతల నుంచి తప్పించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా కొత్త కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌, ఆశిశ్‌ నెహ్రా (Ashish Nehra) పేర్లను క్రికెట్‌ విశ్లేషకులు, అభిమానులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ (GT) కోచ్‌గా ఉన్న నెహ్రా.. టీమ్‌ఇండియా కోచ్‌ పదవిపై వస్తున్న చర్చకు స్పందించాడు.

వివరాలు

భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం

తనకు అలాంటి నిర్దిష్టమైన ఆశయం ఏమీ లేదని స్పష్టం చేశాడు. అయితే, ఒకవేళ ఆ బాధ్యత కోసం తనను సంప్రదిస్తే.. నిర్ణయం తీసుకునే ముందు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని వివరించాడు.

''టీమ్‌ఇండియా కోచ్‌ కావడం గొప్ప గౌరవం. కానీ, ఇలాంటి విషయాల గురించి నేను ఎప్పుడూ ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోను. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. ప్రస్తుతం మాత్రం నాకు అలాంటి ఆశయం ఏమీ లేదు.

గుజరాత్‌ టైటాన్స్‌ కోచ్‌గా సంతోషంగా ఉన్నాను. టీమ్‌ఇండియా కోచ్‌గా వస్తానా? లేదా? అనే విషయంపై ఇప్పుడు సమాధానం చెప్పడం చాలా కష్టం. ముందుగా నా భార్యను అడగాలి.

వివరాలు

విడాకులు ఇచ్చే ప్రమాదం ఉంది

ఆమెకు చెప్పకుండా ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. విడాకులు ఇచ్చే ప్రమాదం ఉందని నెహ్రా సరదాగా వ్యాఖ్యానించాడు.

జాతీయ జట్టుకు కోచింగ్‌ ఇవ్వడం అంటే నిరంతరం ప్రయాణాలు చేయాల్సి ఉంటుందని నెహ్రా పేర్కొన్నాడు.

ఏడాదిలో దాదాపు ఎనిమిది లేదా తొమ్మిది నెలలు జట్టుతోనే ఉండాల్సి వస్తుందని, ఇది అంత సులభమైన బాధ్యత కాదని వివరించాడు.

ADVERTISEMENT

వివరాలు

2027 ప్రపంచకప్‌లో రోహిత్‌, కోహ్లీ ఉంటారా?

ఇక 2027 వన్డే ప్రపంచకప్‌లో భారత స్టార్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఆడతారా? లేదా? అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని ఆశిశ్‌ నెహ్రా అన్నాడు.

ప్రపంచకప్‌కు ఇంకా 13 నెలల సమయం ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో 'రోకో' (Roko) జట్టులోకి వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమని పేర్కొన్నాడు.

టెస్టులు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు.

ఈ క్రమంలో సెప్టెంబర్‌ 27 నుంచి ప్రారంభం కానున్న వెస్టిండీస్‌ వన్డే సిరీస్‌తో ఈ ఇద్దరూ మళ్లీ బరిలోకి దిగనున్నారు.

ADVERTISEMENT