MS Dhoni : ఫాన్స్ కోసం ఎంత కష్టమైనా భరిస్తా : ఎంఎస్ ధోని
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(MS Dhoni) తన ఆట తీరు, వ్యక్తిత్వంలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
ధోని సంబంధించిన ఏ చిన్న విషయమైనా వైరల్ గా మారుతుంది. ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో రకాల హెయిర్ స్టైల్స్ మారుస్తూ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాడు.
ఇటీవలే చాలా కాలం తర్వాత కొత్త హెయిర్ స్టైల్ ను మహీ బాయ్ ట్రై చేశాడు.
దీనికి సంబంధిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వీపరితంగా వైరల్ అయ్యాయి. తాజాగా తన కొత్త హెయిర్ స్టైల్ గురించి ధోని మాట్లాడారు.
తాను గతంలో ఎన్నో యాడ్ ఫీల్మ్ కోసం వెళ్లినప్పుడు, మేకప్ కోసం 20 నిమిషాలు సమయం తీసుకుంటానని చెప్పాడు.
Details
హెయిర్ స్టైల్ మేకప్ కోసం గంటల పాటు కూర్చోవాల్సి వస్తోంది : ధోని
ఇప్పుడు మాత్రం గంటకు పైగా సమయం పడుతోందని, అలా గంటల పాటు కూర్చొని సిద్ధం కావడం వల్ల తన బోరింగ్ గా ఉందన్నారు.
అయితే తన అభిమానులు మాత్రం హెయిర్ స్టైయిల్ బాగుందని చెబుతున్నారని, వారికి ఎంత కష్టనైనా భరిస్తానని ధోని వెల్లడించారు.
ప్రస్తుతమున్న హెయిర్ స్టైల్ లో ఉండేందుకు ప్రయత్నిస్తానని, అయితే ఏదో ఒక రోజు మళ్లీ హెయిర్ స్టైల్ మారుస్తానని పేర్కొన్నాడు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.