150కిలోమీటర్ల వేగంతో వెన్నులో వణుకు పుట్టించిన ఉమ్రాన్ మాలిక్
భారత్ యువ ఫాస్ట్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తన బౌలింగ్ త ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. ఏకంగా 150 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి.. బ్యాట్స్ మెన్స్ కు వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. కాశ్మీర్ కు చెందిన ఈ బౌలర్ ప్రస్తుతం భారత్ తరుపున ఫాస్టెస్ట్ బాల్ వేసి రికార్డు బద్దలు కొట్టాడు. శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో 155 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ వేసి లంక్ కెప్టెన్ దనుష్ శనక వికెట్ ను పడగొట్టాడు. ఈ బంతిని దనుష శకన గట్టిగా కొట్టగా.. అది వెళ్లి చాహెల్ చేతిలో పడింది. శనక వికెట్ తీయడంతో భారత్ విజయానికి దగ్గరైంది.
షోయాబ్ ఆక్తర్ రికార్డుపై గురి
ప్రస్తుతం ఈ కశ్మీర్ ఎక్స్ ప్రెస్ మాలిక్ షోయబ్ ఆక్తర్ రికార్డుపై గురి పెట్టాడు. నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో155 కి.మీ వేగంతో నిప్పులు చెరిగాడు అయితే అంతర్జాతీయ క్రికెట్లో ఫాస్టెస్ట్ బాల్ రికార్డు పాకిస్తాన్ మాజీ ప్లేయర్ షోయబ్ అక్తర్ పేరిట ఉంది. 2003 వన్డే వరల్డ్ కప్ లో షోయాబ్ ఆక్తర్ 161.3 కిలోమీటర్ల వేగంతో బంతిని వేసి రికార్డును సృష్టించాడు. అయితే ఈ రికార్డును బద్దలు కొడతానని మాలిక్ ధీమా వ్యక్తం చేశారు. ఇదే వేగంతో బంతులు విసిరితే రికార్డు కచ్చితంగా బద్దలు కొట్టే అవకాశం ఉందని భారత మాజీ ప్లేయర్లు అభిప్రాయపడ్డారు.