Loading...
IND vs PAK : వన్డే ప్రపంచకప్‌ 2027లో భారత్‌-పాక్‌ మూడు సార్లు ఢీ?.. ఐసీసీ కొత్త ఫార్మాట్‌తో బంపర్ ట్విస్ట్!
వన్డే ప్రపంచకప్‌ 2027లో భారత్‌-పాక్‌ మూడు సార్లు ఢీ?.. ఐసీసీ కొత్త ఫార్మాట్‌తో బంపర్ ట్విస్ట్!

IND vs PAK : వన్డే ప్రపంచకప్‌ 2027లో భారత్‌-పాక్‌ మూడు సార్లు ఢీ?.. ఐసీసీ కొత్త ఫార్మాట్‌తో బంపర్ ట్విస్ట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 16, 2026
05:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత ఉత్కంఠభరిత పోరుగా భావిస్తారు. ఈ రెండు దేశాల అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు కూడా ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ప్రస్తుతం ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీల్లో మాత్రమే భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 2027 వన్డే ప్రపంచకప్‌లో ఈ చిరకాల ప్రత్యర్థులు ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు.. ఏకంగా మూడుసార్లు తలపడే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు కారణం ఐసీసీ ప్రవేశపెట్టబోతున్న కొత్త టోర్నీ ఫార్మాట్.

వివరాలు

2027 ప్రపంచకప్‌కు మూడు ఆతిథ్య దేశాలు

2027 వన్డే ప్రపంచకప్‌ను దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా నిర్వహించనున్నాయి.

ఈసారి మొత్తం 14 జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. గత టోర్నీలతో పోలిస్తే ఈ ఎడిషన్‌లో ఫార్మాట్ పూర్తిగా కొత్తగా ఉండనుంది.

తొలి దశ

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 12, 13, 14 స్థానాల్లో ఉన్న మూడు జట్లు** ముందుగా ప్రత్యేక పోటీలో తలపడతాయి.

అందులో విజేతగా నిలిచిన జట్టు మిగిలిన 11 జట్లతో కలిసి ప్రధాన టోర్నీలో అడుగుపెడుతుంది.

వివరాలు

గ్రూప్ దశ

ప్రధాన టోర్నీలో 12 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు.

ఒక్కో గ్రూప్‌లో ఆరు జట్లు ఉంటాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్-3 జట్లు నేరుగా తదుపరి దశకు అర్హత సాధిస్తాయి.

అయితే ఈసారి మరో కొత్త నిబంధనను కూడా తీసుకొస్తున్నారు. రెండు గ్రూపుల్లో నాలుగో స్థానంలో నిలిచిన జట్ల మధ్య ప్రత్యేక మ్యాచ్ నిర్వహిస్తారు.

అందులో గెలిచిన జట్టు కూడా తదుపరి దశకు చేరుతుంది. దీంతో మొత్తం ఏడు జట్లు ముందుకు వెళ్తాయి.

సూపర్-7 దశ

సూపర్-7లో అర్హత సాధించిన ఏడు జట్లు రౌండ్-రాబిన్ పద్ధతిలో పరస్పరం తలపడతాయి. ఈ దశ ముగిసే సరికి టాప్-4 జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి.

అనంతరం సెమీస్ విజేతలు ఫైనల్‌లో ప్రపంచకప్ కోసం పోటీ పడతాయి.

ADVERTISEMENT

వివరాలు

భారత్-పాకిస్థాన్ మూడు సార్లు ఎలా తలపడతాయి?

ఐసీసీ టోర్నీల్లో సాధారణంగా భారత్, పాకిస్థాన్ జట్లను ఒకే గ్రూపులో ఉంచే సంప్రదాయం కొనసాగుతోంది.

అదే జరిగితే గ్రూప్ దశలో ఒకసారి ఈ రెండు జట్లు తలపడతాయి. ఆ తర్వాత ఇరు జట్లు సూపర్-7కు అర్హత సాధిస్తే అక్కడ మరోసారి ముఖాముఖి అవుతాయి.

ఇక రెండూ సెమీఫైనల్‌కు చేరి డ్రా ఆధారంగా సెమీస్‌లోనో లేదా ఫైనల్‌కు అర్హత సాధిస్తే ఫైనల్‌లోనో మరోసారి ఢీకొనే అవకాశం ఉంటుంది.

అంటే కొత్త ఫార్మాట్ ప్రకారం పరిస్థితులు అనుకూలిస్తే 2027 వన్డే ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య ఏకంగా మూడు హై-వోల్టేజ్ మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది.

ADVERTISEMENT