Loading...
MI vs RR : ముంబైలో వర్షం భయం.. రాజస్థాన్‌కు పెరిగిన ఉత్కంఠ.. మ్యాచ్ రద్దైతే ప్లేఆఫ్స్‌కు చేరేది ఏ జట్టు?
ముంబైలో వర్షం భయం.. రాజస్థాన్‌కు పెరిగిన ఉత్కంఠ.. మ్యాచ్ రద్దైతే ప్లేఆఫ్స్‌కు చేరేది ఏ జట్టు?

MI vs RR : ముంబైలో వర్షం భయం.. రాజస్థాన్‌కు పెరిగిన ఉత్కంఠ.. మ్యాచ్ రద్దైతే ప్లేఆఫ్స్‌కు చేరేది ఏ జట్టు?

వ్రాసిన వారు Moogati Shabari
May 24, 2026
01:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌ రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్స్‌లో తమ స్థానాలను ఖరారు చేసుకున్నాయి. ఇక మిగిలిన ఒక్క బెర్త్ కోసం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. మే 24న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధిస్తే, ఇతర ఫలితాలతో సంబంధం లేకుండా 16 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెడుతుంది. అయితే రాజస్థాన్ ఓడిపోతే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. పంజాబ్, కోల్‌కతా జట్లకు అవకాశాలు సజీవంగా ఉంటాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈరోజు ఢిల్లీతో తలపడనుంది.

వివరాలు

ముంబైలో వర్ష సూచనలు..

ఆ మ్యాచ్‌లో కోల్‌కతా ఓడిపోతే ప్లేఆఫ్స్ ఆశలు ముగుస్తాయి. ఒకవేళ గెలిస్తే, పంజాబ్‌తో కలిసి 15 పాయింట్ల వద్ద సమానంగా నిలుస్తుంది.

అప్పుడు మెరుగైన నెట్‌రన్‌రేట్ ఉన్న జట్టుకే ప్లేఆఫ్స్ అవకాశం దక్కుతుంది.

ముంబైలో ఈ ఉదయం వర్షం కురవడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

దీంతో ముంబై-రాజస్థాన్ మ్యాచ్ అంతరాయం లేకుండా జరుగుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే ప్లేఆఫ్స్ సమీకరణాలు ఎలా మారతాయన్నది ఆసక్తికరంగా మారింది.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మధ్యాహ్న సమయంలో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది.

సాయంత్రానికి ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

వివరాలు

మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఇలా..

వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దైతే, ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు.

అప్పుడు రాజస్థాన్ రాయల్స్ 15 పాయింట్లతో ముగించినప్పటికీ ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోతుంది.

కారణం, ఆ జట్టు నెట్‌రన్‌రేట్ పంజాబ్ కంటే తక్కువగా ఉండటమే. ప్రస్తుతం పంజాబ్ నెట్‌రన్‌రేట్ ప్లస్ 0.309గా ఉండగా, రాజస్థాన్ నెట్‌రన్‌రేట్ ప్లస్ 0.083గా ఉంది.

మ్యాచ్ రద్దైతే రాజస్థాన్ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటుంది. అనంతరం అర్హత పోటీ పూర్తిగా కోల్‌కతా, పంజాబ్ జట్ల మధ్యకు పరిమితమవుతుంది.

కోల్‌కతా గెలిస్తే, పంజాబ్‌తో సమాన పాయింట్ల వద్ద నిలిచి, మెరుగైన నెట్‌రన్‌రేట్ ఆధారంగా ఈ రెండు జట్లలో ఒకటి ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశిస్తుంది.

అదే కోల్‌కతా ఓడిపోతే, పంజాబ్ నేరుగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న పోస్ట్ ఇదే..

ADVERTISEMENT