LOADING...
T20 WC 2026: ఆ ఆనవాయితీ కొనసాగుతుందా? ఫైనల్లో కప్‌పై కన్నేసిన భారత్!
: ఆ ఆనవాయితీ కొనసాగుతుందా? ఫైనల్లో కప్‌పై కన్నేసిన భారత్!

T20 WC 2026: ఆ ఆనవాయితీ కొనసాగుతుందా? ఫైనల్లో కప్‌పై కన్నేసిన భారత్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 06, 2026
02:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటివరకు రెండు సెమీఫైనల్స్‌ జరిగాయి. ఆసక్తికరంగా ఆ రెండు సందర్భాల్లోనూ సెమీస్‌లో గెలిచిన జట్టు తర్వాత ఫైనల్లోనూ విజయం సాధించి కప్పు అందుకుంది. 2022 టోర్నీ సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌ భారత్‌ను ఓడించింది. అనంతరం ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. 2024 ప్రపంచకప్‌లో మాత్రం పరిస్థితి తారుమారైంది. ఆ సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఓడించిన టీమ్‌ఇండియా, ఫైనల్లో దక్షిణాఫ్రికాపై గెలిచి ట్రోఫీని అందుకుంది. ఈసారి కూడా సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌ను భారత్‌ ఓడించింది. దీంతో గత ఆనవాయితీ కొనసాగుతుందా అనే ఆసక్తి నెలకొంది.

Details

న్యూజిలాండ్ తో తలపడడం ఇది నాలుగోసారి

ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి టీమ్‌ఇండియా మరోసారి విజేతగా నిలుస్తుందా అన్నది చూడాలి. ఐసీసీ టోర్నీల ఫైనల్లో భారత్‌, న్యూజిలాండ్‌ తలపడటం ఇదే నాలుగోసారి. 2021లో జరిగిన టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో కివీస్‌ భారత్‌పై విజయం సాధించింది. అంతకుముందు 2000 ఛాంపియన్స్‌ ట్రోఫీ తుదిపోరులోనూ న్యూజిలాండ్‌ భారత్‌ను ఓడించి ట్రోఫీ అందుకుంది. అయితే 2025లో జరిగిన మరో తుది పోరులో భారత్‌ న్యూజిలాండ్‌పై గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పుడు అహ్మదాబాద్‌ వేదికగా జరిగే ఈ ఫైనల్‌ మరోసారి ఈ రెండు జట్ల మధ్య పోటీని మరింత ఆసక్తికరంగా మార్చింది.

Advertisement