Women's Asia Cup 2026: యూఏఈలో మహిళల ఆసియా కప్-2026?.. షెడ్యూల్‌పై త్వరలో ఏసీసీ అధికారిక ప్రకటన!
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల ఆసియా కప్-2026 టోర్నీ నిర్వహణపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడకపోయినా, ఈ మెగా ఈవెంట్‌ను ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 13 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే టోర్నీ షెడ్యూల్, వేదిక, తేదీలను ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం మొహ్సిన్ నఖ్వీ ఏసీసీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. టోర్నీకి సంబంధించిన అన్ని వివరాలకు ఆయన నేతృత్వంలోని ఏసీసీ తుది ఆమోదం ఇవ్వాల్సి ఉంది.
వివరాలు
8 జట్ల మధ్య టైటిల్ పోరు
ఈసారి మహిళల ఆసియా కప్‌లో మొత్తం ఎనిమిది జట్లు బరిలోకి దిగనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో పాటు భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా, థాయ్‌లాండ్, ఆతిథ్య యూఏఈ జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి.
షెడ్యూల్‌పై ఇంకా స్పష్టత లేదు
టోర్నీ షెడ్యూల్, వేదిక, తేదీలను ఏసీసీ ఇంకా ఖరారు చేయలేదు.
అయితే జూలై 22న పాల్గొనే దేశాలకు పంపిన ఈమెయిల్‌లో వేదిక ఖరారు చేసే ప్రక్రియ కొనసాగుతోందని, జట్లు ఆగస్టు 27న యూఏఈ చేరుకోవాలని, సెప్టెంబర్ 13న ఫైనల్ నిర్వహించాలని ప్రాథమికంగా ప్రస్తావించినట్లు క్రిక్‌ఇన్‌ఫో వెల్లడించింది.
దీంతో అన్ని దేశాలు అధికారిక షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. షెడ్యూల్ వెలువడిన తర్వాతే ప్రయాణం, వసతి తదితర ఏర్పాట్లను ఖరారు చేయనున్నాయి.
వివరాలు
టీమిండియా జట్టుపై గందరగోళం
ఆగస్టు 2న భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మహిళల ఆసియా కప్‌కు భారత జట్టును ప్రకటించింది.
అయితే ఏసీసీ నుంచి అధికారిక షెడ్యూల్ విడుదల కాకముందే జట్టును ప్రకటించడం తొందరపాటు నిర్ణయమని భావించిన బీసీసీఐ, కొద్దిసేపటికే ఆ పోస్టును సోషల్ మీడియా నుంచి తొలగించింది.
ఆసియా కప్ తర్వాత ఆసియా క్రీడలు
మహిళల ఆసియా కప్ ముగిసిన కొద్ది రోజులకే 2026 ఆసియా క్రీడలు జపాన్‌లోని నగోయాలో జరగనున్నాయి. మహిళల క్రికెట్ పోటీలు సెప్టెంబర్ 17 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు.
వివరాలు
మహిళల ఆసియా కప్‌కు భారత జట్టు (అంచనా)
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జీ కమలిని (వికెట్ కీపర్), దీప్తి శర్మ
రాధా యాదవ్, ప్రేమా రావత్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్, ఎన్ శ్రీ చరణి, నందని శర్మ.