LOADING...
Smriti Mandhana : మహిళల వన్డే ర్యాంకింగ్స్‌.. టాప్‌లోనే స్మృతి మంధాన
మహిళల వన్డే ర్యాంకింగ్స్‌.. టాప్‌లోనే స్మృతి మంధాన

Smriti Mandhana : మహిళల వన్డే ర్యాంకింగ్స్‌.. టాప్‌లోనే స్మృతి మంధాన

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 11, 2026
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ ఓపెనర్‌ స్మృతి మంధాన తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ కౌర్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఇక జెమిమా రోడ్రిగ్స్ ఒక స్థానం కోల్పోయి ప్రస్తుతం 12వ ర్యాంకులో నిలిచింది. ఇతర దేశాల ఆటగాళ్ల విషయానికి వస్తే, దక్షిణాఫ్రికా కెప్టెన్‌ లారా వోల్వార్డ్ట్ రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా ఓపెనర్‌ బెత్ మూనీ మూడో స్థానంలో ఉండగా, అదే జట్టు ఆల్‌రౌండర్‌ ఆష్లీ గార్డనర్ నాలుగో ర్యాంక్‌లో ఉంది.

Details

ఐదో స్థానంతో నాట్ స్కైవర్-బ్రంట్

ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ నాట్ స్కైవర్-బ్రంట్ ఐదో స్థానంతో టాప్‌-5లో నిలిచింది. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత్‌ తరఫున అత్యుత్తమంగా దీప్తి శ‌ర్మ‌ ఆరో స్థానంలో నిలిచింది. టాప్‌-10లో చోటు దక్కించుకున్న ఏకైక భారత బౌలర్‌ ఆమెనే. ఇదే విభాగంలో ఆష్లీ గార్డనర్ నంబర్‌వన్‌ బౌలర్‌గా కొనసాగుతోంది. ఆమె తర్వాత హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్‌), అన్నాబెల్ సదర్లాండ్ (ఆస్ట్రేలియా), మారిజాన్ కాప్ (దక్షిణాఫ్రికా), అమేలియా కెర్ (న్యూజిలాండ్‌) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో దీప్తి శ‌ర్మ నాలుగో ర్యాంక్‌ను దక్కించుకుంది. ఈ విభాగంలో పాకిస్థాన్‌ స్పిన్నర్‌ సాదియా ఇక్బాల్ నంబర్‌వన్‌ ఆల్‌రౌండర్‌గా కొనసాగుతోంది.

Advertisement