Loading...
Hockey world cup: హాకీ ప్రపంచ కప్‌: రెండో రౌండ్‌కు భారత్.. ఇంగ్లాండ్ ఇంటిముఖం
హాకీ ప్రపంచ కప్‌: రెండో రౌండ్‌కు భారత్.. ఇంగ్లాండ్ ఇంటిముఖం

Hockey world cup: హాకీ ప్రపంచ కప్‌: రెండో రౌండ్‌కు భారత్.. ఇంగ్లాండ్ ఇంటిముఖం

వ్రాసిన వారు Moogati Shabari
Aug 21, 2026
09:35 am

ఈ వార్తాకథనం ఏంటి

హాకీ ప్రపంచ కప్‌లో భారత్ రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. పూల్‌-డి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన పోరును భారత్ 0-0తో డ్రాగా ముగించింది. మ్యాచ్‌ ఆద్యంతం ఇంగ్లాండ్‌ గోల్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. భారత ప్లేయర్లు అద్భుతంగా అడ్డుకుని ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. ఇరు జట్లు గోల్‌ చేయడంలో విఫలం కావడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. దీంతో భారత్‌ ఐదు పాయింట్లతో పూల్‌-డి నుంచి రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. మరోవైపు నాలుగు పాయింట్లతో ఉన్న ఇంగ్లాండ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించి ఇంటిముఖం పట్టింది.

ADVERTISEMENT