Yashasvi Jaiswal: చిన్న వయుసులో టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన మూడో ప్లేయర్ జైస్వాల్
భారత స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టు క్రికెట్‌లో తన తొలి డబుల్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో 2వ రోజు అతను ఈ మైలురాయిని సాధించాడు. జైస్వాల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 290బంతుల్లో 209 పరుగులు సాధించాడు. దీంతో టెస్ట్ డబుల్ సెంచరీ సాధించిన మూడవ పిన్న వయస్కుడైన భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో అతనికి ఇది రెండో టెస్టు సెంచరీ. ఇంగ్లండ్‌పై టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత ఓపెనర్‌గా కూడా జైస్వాల్ నిలిచాడు. 1979 ఓవల్ టెస్టులో సునీల్ గవాస్కర్ 221పరుగులు చేశారు. ఆ తర్వాత ఇంగ్లండ్‌పై ఎవరూ డబుల్ సెంచరీ చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు జైశ్వాల్ చేశారు.
స్వదేశంలో డబుల్ సెంచరీ చేసిన తొలి ఓపెనర్
స్వదేశంలో ఇంగ్లండ్‌పై డబుల్ సెంచరీ చేసిన తొలి భారత ఓపెనర్‌గా జైస్వాల్ నిలిచాడు. ఇదిలా ఉండగా.. 22 సంవత్సరాల 37రోజుల వయస్సులో వినోద్ కాంబ్లీ, 22ఏళ్ల 277 రోజుల్లో గవాస్కర్ డబుల్ సెంచరీలు చేశారు. వీరి తర్వాత అతని చిన్న వయసులో డబుల్ సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు. అలాగే ఇంగ్లండ్‌పై భారత్ తరఫున ఒక రోజు ఆటలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా జైస్వాల్ కావడం గమనార్హం. 2000తర్వాత ఇంగ్లండ్‌పై 150కి పైగా పరుగులు చేసిన నాలుగో భారత ఓపెనర్ జైస్వాల్. జైస్వాల్ కంటే ముందు 2008 మొహాలీలో గౌతమ్ గంభీర్(179), చెన్నై 2016లో కేఎల్ రాహుల్(199), చెన్నైలో రోహిత్ శర్మ(161) మాత్రమే ఈ ఘనత సాధించారు.