Loading...
Yuzvendra Chahal: యుజ్వేంద్ర చాహల్ కీలక నిర్ణయం.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు గుడ్‌బై
యుజ్వేంద్ర చాహల్ కీలక నిర్ణయం.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు గుడ్‌బై

Yuzvendra Chahal: యుజ్వేంద్ర చాహల్ కీలక నిర్ణయం.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు గుడ్‌బై

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 02, 2026
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత వెటరన్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని చాహల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడిస్తూ.. తన క్రికెట్ ప్రయాణం, భవిష్యత్ లక్ష్యాల గురించి తన అభిప్రాయాలను పంచుకున్నాడు. భారత్ తరఫున టెస్టుల్లో ఆడే అవకాశం తనకు ఎప్పుడూ రాలేదని చాహల్ తెలిపాడు. అయితే వన్డేలు, టీ20 ఫార్మాట్లలో మాత్రం తిరిగి భారత జట్టులోకి రావాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. నా క్రికెట్‌లో ఇంకా మిగిలి ఉంది అని నేను నమ్ముతున్నాను. వన్డే, టీ20 ఫార్మాట్లలో మరో అవకాశం సంపాదించేందుకు శక్తిమేర కృషి చేస్తానని చాహల్ పేర్కొన్నాడు.

వివరాలు

148 ఫస్ట్ క్లాస్ వికెట్లతో ముగింపు

చాహల్ 2009లో హర్యానా తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తన కెరీర్‌ను ప్రారంభించాడు.

మొత్తం 49 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 148 వికెట్లు పడగొట్టాడు.

అతడి బౌలింగ్ సగటు 32.27గా ఉంది. ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో చాహల్ 6 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన (5W), 8 సార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన (4W) నమోదు చేశాడు.

వివరాలు

నార్తాంప్టన్‌షైర్‌తో చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు

చాహల్ తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో చివరిగా నార్తాంప్టన్‌షైర్ తరఫున ఆడాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్-2లో ఆ జట్టు తరఫున అతడు 21వికెట్లు పడగొట్టాడు.

ఈ సమయంలో చాహల్ బౌలింగ్ సగటు 16.14గా ఉంది. కనీసం 20 వికెట్లు తీసిన బౌలర్లలో ఇది రెండో అత్యుత్తమ సగటుగా నిలిచింది. ఫస్ట్ క్లాస్ ఫార్మాట్‌లో చాహల్ చివరి మ్యాచ్ మిడిల్సెక్స్‌తో జరిగింది.

ఈ మ్యాచ్‌లో మిడిల్సెక్స్ 7వికెట్ల తేడాతో నార్తాంప్టన్‌షైర్‌ను ఓడించింది. దీంతో నార్తాంప్టన్‌షైర్ ప్రమోషన్ ఆశలకు తెరపడింది.

ఇలా 2009లో హర్యానాతో ప్రారంభమైన యుజ్వేంద్ర చాహల్ ఫస్ట్ క్లాస్ కెరీర్.. 49 మ్యాచ్‌లు, 148వికెట్లు పడగొట్టాడు.అయితే వన్డేలు, టీ20ల్లో మరోసారి భారత జట్టులోకి వచ్చేందుకు తన ప్రయత్నాలను కొనసాగిస్తానని చాహల్ స్పష్టం చేశాడు.

ADVERTISEMENT