Hormuz Strait Attack: హర్మూజ్‌లో వాణిజ్య నౌకపై దాడి.. 11 మంది భారత నావికులకు గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఒమన్ తీరానికి సమీపంలో ఈ జలసంధి గుండా ప్రయాణిస్తున్న పనామా జెండాతో కూడిన 'ఎంటీ ఆన్ పీస్' వాణిజ్య నౌకపై మంగళవారం రాకెట్ దాడి జరిగింది. ఈ ఘటనలో 11 మంది భారతీయ నావికులతో పాటు మొత్తం 12 మంది సిబ్బంది గాయపడినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నౌకలో 19 మంది సిబ్బంది దాడి జరిగిన సమయంలో నౌకలో మొత్తం 19 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 17 మంది భారతీయులే ఉన్నారు. రాకెట్ దాడి అనంతరం గాయపడిన వారిని ఒమన్ అధికారుల సహకారంతో నౌక నుంచి తరలించారు. అనంతరం సమీపంలోని ఖసాబ్ నగరంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య చికిత్స అందిస్తున్నారు.
వివరాలు
దాడిని ఖండించిన భారత్
వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. గాయపడిన నావికులను సురక్షితంగా ఆసుపత్రికి తరలించేందుకు సహకరించిన ఒమన్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది.
వాణిజ్య నౌకలపై దాడులపై ఆందోళన
హర్మూజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై వరుసగా దాడులు జరుగుతుండటంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
పౌర మౌలిక సదుపాయాలు, వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం వెంటనే నిలిపివేయాలని కోరింది.
అంతర్జాతీయ జలమార్గాల్లో నౌకాయానం, వాణిజ్య కార్యకలాపాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సురక్షితంగా కొనసాగేందుకు అవసరమైన పరిస్థితులను కల్పించాలని భారత్ పిలుపునిచ్చింది.