Loading...
South Africa: ఇంట్లో పార్టీ జరుగుతుండగా చొరబడ్డ సాయుధులు.. దక్షిణాఫ్రికాలో 11 మంది మృతి
ఇంట్లో పార్టీ జరుగుతుండగా చొరబడ్డ సాయుధులు.. దక్షిణాఫ్రికాలో 11 మంది మృతి

South Africa: ఇంట్లో పార్టీ జరుగుతుండగా చొరబడ్డ సాయుధులు.. దక్షిణాఫ్రికాలో 11 మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 23, 2026
01:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణాఫ్రికాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్న వారిపై సాయుధులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 11మంది మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.మృతుల్లో ఓ గర్భిణి కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పార్టీ జరుగుతుండగా ఇంట్లోకి చొరబడి.. మంగళవారం అర్ధరాత్రి డర్బన్‌ నగర సమీపంలోని క్వామాఖుతా టౌన్‌షిప్‌లో ఈ ఘటన జరిగింది. స్థానిక అధికారుల వివరాల ప్రకారం..ఓ నివాస భవనంలో కుటుంబసభ్యులు, స్నేహితులు కలిసి పార్టీ చేసుకుంటున్నారు. అదే సమయంలో ముగ్గురు సాయుధ వ్యక్తులు అకస్మాత్తుగా ఇంట్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత అక్కడ ఉన్న వారిపై తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. మొత్తం 14మందిని లక్ష్యంగా చేసుకుని దుండగులు పలు రౌండ్ల కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.

వివరాలు 

కాల్పుల శబ్దంతో పరుగులు..

ఇంట్లో నుంచి వరుసగా కాల్పుల శబ్దాలు వినిపించడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

స్థానికులు ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. కాల్పుల్లో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

తీవ్రంగా గాయపడిన నలుగురిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ వారిలో ఒకరు మృతిచెందారు.

దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. మరో ముగ్గురికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.

వివరాలు 

గర్భిణి కూడా మృతి

ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఓ గర్భిణి ఉన్నట్లు దక్షిణాఫ్రికా పోలీసులు తెలిపారు. ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. ఇంతకీ ఈ దారుణానికి అసలు కారణమేంటన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

కాల్పులకు పాల్పడిన ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఘటన వెనుక కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. పాత గొడవలు లేదా వ్యక్తిగత వివాదాల నేపథ్యంలోనే దుండగులు ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

అయితే దాడికి ఖచ్చితమైన కారణం దర్యాప్తు పూర్తయిన తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉంది.

ADVERTISEMENT