Congo: కాంగోలో ఘోర పడవ ప్రమాదం.. 12 మంది మృతి, పలువురు గల్లంతు
ఈ వార్తాకథనం ఏంటి
తూర్పు కాంగోలోని కివు సరస్సులో ఘోర పడవ ప్రమాదం జరిగింది. వ్యాపారులు, ప్రయాణికులతో వెళ్తున్న పడవ అకస్మాత్తుగా బోల్తా పడటంతో 12 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గల్లంతైనట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. ప్రమాదంలో ఇప్పటివరకు 15 మందిని రక్షించినట్లు తెలిపారు. దక్షిణ కివు ప్రావిన్స్‌లోని ఇద్జ్వీ ద్వీపం సమీపంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కిషెకే గ్రామానికి చెందిన ముఖ్య అధికారి ఫెలిక్స్ హబిరాగి ప్రమాద వివరాలను వెల్లడించారు. పడవ బోల్తా పడే సమయంలో అందులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు ఆయన తెలిపారు.
వివరాలు
గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు
ఇద్జ్వీ ద్వీపంలోని బ్వినా నుంచి బోజాకు ఈ పడవ బయలుదేరింది. చేపల వ్యాపారులు, సరకులతో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు స్థానిక అడ్మినిస్ట్రేటర్ ముహిండో న్తాంబుకా పాస్కల్ వెల్లడించారు.
అయితే పడవ ఎందుకు బోల్తా పడిందనే కారణం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదని అధికారులు తెలిపారు.
గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కివు సరస్సులో ఘోర పడవ ప్రమాదం
News Alert ! At least 12 dead, dozens missing after a passenger vessel capsized in eastern Congo's Lake Kivu, reports AP, citing officials
— Press Trust of India (@PTI_News) September 27, 2026