LOADING...
Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు
ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు

Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 31, 2025
04:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల తుర్కియే వేదికగా రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగిన ప్రత్యక్ష శాంతి చర్చలు ఫలితంలేకుండా ముగియగా, తాజాగా మరోసారి రష్యా శాంతి చర్చలకు కొత్త ప్రతిపాదనలు తెచ్చింది. శాంతి చర్చల బాటలో అడుగులు వేస్తున్నప్పటికీ, మైదానంలో మాత్రం దాడులు ఆగడం లేదు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు మాస్కో, కీవ్‌పై దాదాపు 100కు పైగా డ్రోన్లు, ఐదు క్షిపణులను ప్రయోగించిందని ఉక్రెయిన్ వైమానిక దళం పేర్కొంది. వాటిలో 42 డ్రోన్లను తమ రక్షణ బలగాలు తుడిచేశాయని వెల్లడించింది. ఈ దాడుల్లో జపోరిజ్జియా ప్రాంతంలోని ఫ్రంట్‌లైన్ గ్రామం డోలింకా తీవ్రంగా ప్రభావితమైంది.

Details

9ఏళ్ల బాలిక మృతి

ఈ ఘటనలో 9ఏళ్ల బాలిక మృతి చెందగా, భారీగా ఆస్తి నష్టం జరిగింది. పలువురు గాయపడినట్లు రాష్ట్ర గవర్నర్ ఇవాన్ ఫెడోరోవ్ తెలిపారు. ప్రతీకారంగా ఉక్రెయిన్ కూడా రష్యాలోని పలు ప్రాంతాలపై డ్రోన్ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 14 మంది గాయపడగా, పలు భవనాలు ధ్వంసమయ్యాయని రష్యా ఆరోగ్యశాఖ వెల్లడించింది. సోమవారం ఇస్తాంబుల్‌లో రష్యాతో ప్రత్యక్ష శాంతి చర్చలు ప్రారంభించడానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని, కానీ చర్చల ముందుగా రష్యా యుద్ధ ముగింపు విషయంలో తమ వైఖరిని వెల్లడిస్తూ ఒక మెమోరాండం ఇవ్వాలని ఉక్రెయిన్ సలహాదారు ఆండ్రీ యెర్మాక్ స్పష్టం చేశారు. మరోవైపు, యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కృషి చేస్తున్నారు.

Details

భవిష్యత్తులో శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ తో కలిపి పనిచేసేందుకు సిద్ధం

మే 19న ట్రంప్ - పుతిన్ మధ్య జరిగిన రెండు గంటల ఫోన్ సంభాషణలో ఈ అంశంపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో పుతిన్ స్పందిస్తూ భవిష్యత్తులో శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్‌తో కలసి పనిచేసేందుకు తాను సిద్ధమని తెలిపారు. అయితే మరోవైపు ఉత్తర కొరియా నుంచి రష్యాకు మద్దతుగా సైనిక, ఆయుధ సహాయం కొనసాగుతోంది. ఇప్పటికే వేల మందిని పంపిన ఉత్తర కొరియా, తాజాగా మరో 14 వేల మంది సైనికులు, 9 లక్షల రౌండ్ల మందుగుండు సామగ్రి, 100 బాలిస్టిక్ క్షిపణులు, రాకెట్ లాంచర్లను మాస్కోకు పంపినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో యుద్ధం ముగిసే పరిస్థితులకన్నా మరింత క్లిష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.