Loading...
Grand Canyon Floods: అమెరికాలో ఆకస్మిక వరదలు.. గ్రాండ్‌ కేనియన్‌లో 20 మందికి పైగా గల్లంతు
అమెరికాలో ఆకస్మిక వరదలు.. గ్రాండ్‌ కేనియన్‌లో 20 మందికి పైగా గల్లంతు

Grand Canyon Floods: అమెరికాలో ఆకస్మిక వరదలు.. గ్రాండ్‌ కేనియన్‌లో 20 మందికి పైగా గల్లంతు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 31, 2026
09:04 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని ప్రముఖ గ్రాండ్‌ కేనియన్‌ నేషనల్‌ పార్క్‌లో ఆకస్మిక వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. కేవలం అరగంట వ్యవధిలో కురిసిన భారీ వర్షంతో బ్రైట్‌ ఏంజెల్‌ క్రీక్‌ ఒక్కసారిగా ఉప్పొంగింది. వరద ఉధృతికి భారీ బండరాళ్లు,ఇనుప నిర్మాణాలు,ఇతర శిథిలాలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో 20మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం సుమారు 2.30 గంటల సమయంలో బ్రైట్‌ ఏంజెల్‌ క్రీక్‌లో అకస్మాత్తుగా వరద ఉధృతి పెరిగింది. భారీగా వచ్చిన నీరు కొలరాడో నదిలోకి దూసుకెళ్లింది. మార్గమధ్యంలోని ఫుట్‌బ్రిడ్జ్‌లు ఈ వరద ప్రవాహానికి ధ్వంసమయ్యాయి.

వివరాలు 

30 నిమిషాల్లోనే భారీ వర్షపాతం

వరద తీవ్రతకు అక్కడి భౌగోళిక స్వరూపంలోనూ మార్పులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని వీడియోల్లో గతంలో లేని కొత్త నదీ ప్రవాహం ఏర్పడినట్లు కనిపిస్తోంది.

కేవలం 30 నిమిషాల్లోనే భారీ వర్షపాతం నమోదైనట్లు నేషనల్‌ వెదర్‌ సర్వీస్‌ తెలిపింది.

గ్రాండ్‌ కేనియన్‌ ప్రాంతంలో భూభాగం అత్యంత నిటారుగా ఉండటంతో వర్షపు నీరు నేలలోకి పెద్దగా ఇంకలేదు.

దీంతో నీరు ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు వేగంగా ప్రవహించింది. ఫలితంగా వరద ఉధృతి ఊహించని స్థాయికి చేరినట్లు అధికారులు పేర్కొన్నారు.

వివరాలు 

62 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

వరదల తర్వాత ఫాంటమ్‌ రాంచ్‌ నుంచి ఇప్పటివరకు 62 మందిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు నేషనల్‌ పార్క్‌ సర్వీస్‌ వెల్లడించింది.

ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి మరణాలు లేదా గాయాలు నమోదైనట్లు అధికారులు ధ్రువీకరించలేదు.

అయితే 20 మందికి పైగా వ్యక్తుల ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన కొనసాగుతోంది. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.

బ్రైట్‌ ఏంజెల్‌ క్యాంప్‌గ్రౌండ్‌లో ఉన్న ఓ బాధితురాలు ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

తాము క్యాంప్‌గ్రౌండ్‌లో ఉన్న సమయంలో వర్షం మొదలైందని చెప్పారు. అక్కడ ఉన్న సుమారు 50 మంది హైకర్లు క్రీక్‌లో నీటి మట్టం క్రమంగా పెరగడాన్ని గమనించినట్లు తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

62 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

ఆ తర్వాత భారీ శిథిలాలు, నిర్మాణాలకు సంబంధించిన వస్తువులు వరద నీటితో కొట్టుకురావడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారిందని చెప్పారు.

అనంతరం హెలికాప్టర్ల ద్వారా వారిని అక్కడి నుంచి తరలించినట్లు వివరించారు.

ముందుజాగ్రత్తగా బ్రైట్‌ ఏంజెల్‌ క్యాంప్‌గ్రౌండ్‌, ఫాంటమ్‌ రాంచ్‌, నార్త్‌ కైబాబ్‌ ట్రైల్‌లోని కొన్ని ప్రాంతాలను అధికారులు మూసివేశారు.

కొలరాడో నదిలో రాఫ్టింగ్‌ కార్యకలాపాలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు.

మరోవైపు సోమవారం వరకు మరిన్ని ఉరుములు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

దీంతో గ్రాండ్‌ కేనియన్‌ ప్రాంతంలో మళ్లీ ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తం చేశారు.

వరద నీటితో శిథిలాలు కొట్టుకురావడం, కొండచరియలు విరిగిపడే ప్రమాదం కూడా ఉందని హెచ్చరికలు జారీ చేశారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హెలికాప్టర్లతో 62 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అరగంట వర్షంతో గ్రాండ్‌ కేనియన్‌ అతలాకుతలం

ADVERTISEMENT