West Asia Clashes: పశ్చిమాసియా ఘర్షణల్లో 22 మంది భారతీయులు మృతి.. కేంద్రం కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా ఇప్పటివరకు 22 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మృతుల్లో 14 మంది నౌకల్లో పనిచేసే నావికులు ఉన్నారని తెలిపింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు.
వివరాలు
సౌదీ అరేబియాలో ముగ్గురు భారతీయులు మృతి
పశ్చిమాసియాలో ఉన్న భారతీయులతో పాటు నౌకల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో, ఆయా దేశాల్లోని భారత దౌత్య కార్యాలయాలతో అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని రణధీర్ జైస్వాల్ వివరించారు.
ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా సౌదీ అరేబియాలో మరో ముగ్గురు భారతీయులు మరణించినట్లు కూడా వెల్లడించారు.
పశ్చిమాసియాలోని భారత దౌత్య కార్యాలయాలు అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయని చెప్పారు.
గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయ కార్మికులు, నౌకా సిబ్బంది భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
వివరాలు
భారతీయుల కోసం అదనపు విమాన సర్వీసుల
సౌదీ అరేబియాలో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులకు సహాయం చేసేందుకు జెడ్డాలోని భారత కాన్సులేట్ చర్యలు చేపట్టింది.
ముఖ్యంగా ఉమ్రా యాత్రకు వెళ్లిన భారతీయుల ప్రయాణ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొత్త ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది.
సౌదీ అరేబియా నుంచి భారత్‌లోని వివిధ నగరాలకు విమాన సర్వీసులను పెంచేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కాన్సులేట్ వెల్లడించింది.
ఇందుకోసం సౌదీ విమానయాన అధికారులతో పాటు విమానయాన సంస్థల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.
విమాన సర్వీసులకు సంబంధించిన తాజా సమాచారం, ప్రయాణికులకు అవసరమైన వివరాలను జెడ్డాలోని భారత కాన్సులేట్ తన అధికారిక 'ఎక్స్' ఖాతా ద్వారా వెల్లడించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జెడ్డాలోని భారత కాన్సులేట్ చేసిన ట్వీట్
📢 IMPORTANT UPDATE – FLIGHT OPTIONS TO INDIA
— India in Jeddah (@CGIJeddah) October 27, 2026
In continuation of earlier advisories and as part of our ongoing engagement with airlines to facilitate additional air connectivity between Saudi Arabia and India, the Consulate General of India, Jeddah, wishes to share the following… https://t.co/GyqJNQGFgS