Hamza: 9/11కి పాతికేళ్లు.. లాడెన్ వారసుడి వీడియోను విడుదల చేసిన అల్‌ఖైదా
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాతో పాటు యావత్ ప్రపంచాన్ని వణికించిన 9/11 ఉగ్ర దాడులకు శుక్రవారంతో పాతికేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రసంస్థ అల్‌ఖైదా (Al Qaeda) ఓ వీడియోను విడుదల చేసింది. అందులో ఆ ఉగ్రసంస్థ మాజీ అధిపతి ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ (Hamza) మాట్లాడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. 2019లో అఫ్గాన్-పాక్ సరిహద్దులో అమెరికా నిర్వహించిన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌లో హమ్జా మరణించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే 2025లో వెలువడిన పలు నిఘా నివేదికలు మాత్రం హమ్జా బతికే ఉన్నాడని పేర్కొన్నాయి. తాజాగా అల్‌ఖైదా అతడి వీడియోను షేర్ చేయడంతో హమ్జా నిజంగానే ప్రాణాలతో ఉన్నాడా? అనే ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి.
వివరాలు
9/11 దాడులపై ఐరాసలో అమెరికా
ఒసామా బిన్ లాడెన్ వారసుడిగా హమ్జాను ప్రకటించే ఉద్దేశంతోనే అల్‌ఖైదా ఈ వీడియోను విడుదల చేసినట్లు తెలుస్తోంది.
9/11ఉగ్ర దాడులు జరిగి 25ఏళ్లు పూర్తైన నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా రాయబారి మాట్లాడారు. ఈ దాడులకు కారణమైన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను మనమంతా ఐక్యంగా వేటాడి పట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పాకిస్థాన్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు కూడా గమనార్హంగా నిలిచాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ దేశం పోరాడుతోందని ఆయన తెలిపారు.
2001 సెప్టెంబరు 11న అమెరికాలో అల్‌ఖైదా భీకర ఉగ్రదాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో అమెరికా తీవ్రంగా నష్టపోయింది.
దీనికి ప్రతీకారంగా 2011లో అమెరికా కీలక ఆపరేషన్ చేపట్టి.. పాకిస్థాన్‌లో దాక్కొన్న ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చింది.