Loading...
Sri Lanka: శ్రీలంకలో వీసా నిబంధనల ఉల్లంఘన.. 21 మంది విదేశీయుల అరెస్ట్
శ్రీలంకలో వీసా నిబంధనల ఉల్లంఘన.. 21 మంది విదేశీయుల అరెస్ట్

Sri Lanka: శ్రీలంకలో వీసా నిబంధనల ఉల్లంఘన.. 21 మంది విదేశీయుల అరెస్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2026
03:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంకలో వీసా గడువు ముగిసినా అక్కడే ఉంటున్న 21 మంది విదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు భారతీయులు, 12 మంది చైనా పౌరులు ఉన్నారు. కొలంబోలోని మరదానా ప్రాంతంలో సోమవారం రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించి వీరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో ఇద్దరు మహిళలు సహా 12 మంది చైనా పౌరులు,ఆరుగురు బంగ్లాదేశీయులు, ముగ్గురు భారతీయులు ఉన్నట్లు పోలీసులు మంగళవారం వెల్లడించారు. వీరిని మంగళవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. అయితే, అరెస్టయిన వ్యక్తులకు సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించలేదు. కాగా, శ్రీలంకలో పర్యాటక వీసాలపై ఉంటూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఇటీవల పలువురు విదేశీయులను, ముఖ్యంగా చైనా పౌరులను అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

Twitter Post

ADVERTISEMENT