LOADING...
Thailand: థాయిలాండ్‌ డే కేర్ సెంటర్‌లో చొరబడిన సాయుధుడు.. టీచర్లు, చిన్నారుల నిర్బంధం!
టీచర్లు, చిన్నారుల నిర్బంధం!

Thailand: థాయిలాండ్‌ డే కేర్ సెంటర్‌లో చొరబడిన సాయుధుడు.. టీచర్లు, చిన్నారుల నిర్బంధం!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 11, 2026
06:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

థాయిలాండ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. సోంగ్ఖా ప్రావిన్స్‌లోని హ్యాట్‌ హెయ్‌ జిల్లా పరిధిలో ఉన్న ఓ పాఠశాలలోకి ఆయుధాలతో ప్రవేశించిన ఓ వ్యక్తి తీవ్ర కలకలం సృష్టించాడు. అక్కడున్న పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులను అతడు బందీలుగా చేసుకున్నాడు. ఈ ఘటనలో ఒక టీచర్‌పై కాల్పులు జరిపినట్లు సమాచారం అందుతోంది. ఈ దాడికి పాల్పడింది ఓ మాజీ పోలీసు అధికారి అని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు భారీగా అక్కడికి చేరుకుని పాఠశాల ప్రాంగణాన్ని పూర్తిగా ముట్టడి చేశారు. లోపల చిక్కుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయులను ఎలాంటి హానీ జరగకుండా సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని స్థానిక మీడియా వెల్లడించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్కూల్లో చొరబడిన సాయుధుడు

Advertisement