Loading...
Nepal : నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం.. 4.9 తీవ్రత నమోదు
నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం.. 4.9 తీవ్రత నమోదు

Nepal : నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం.. 4.9 తీవ్రత నమోదు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2026
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్‌లో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఉదయం 4.30 గంటల సమయంలో భూమి కంపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.9గా నమోదైంది. భూమికి 73 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నేపాల్‌లోని 27.671 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 87.987 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

వివరాలు 

సిమ్లా జిల్లాలో స్కేల్‌పై 3.9 తీవ్రత

అయితే ఈ ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగిందనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలోనూ బుధవారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 3.9 తీవ్రత నమోదైంది.

రాత్రి 9.50 గంటల సమయంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

జుబ్బల్, రోహ్రూ ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది.

అయితే ఇప్పటివరకు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం

ADVERTISEMENT