'ముస్లింలు చనిపోవాలి' అంటూ.. పాలస్తీనా-అమెరికన్ బాలుడిని 26సార్లు కత్తితో పొడిచాడు
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్-హమాస్ యుద్దం ప్రపంచాన్ని యుదుల సానుభూతిపరులుగా, ముస్లిం మద్దతుదారులుగా విభజించింది.
ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో పాలస్తీనా-అమెరికన్ ముస్లిం కుటుంబానికి చెందిన ఇద్దరుపై అమెరికాకు చెందిన 71ఏళ్ల జుబా దారుణంగా కత్తితో పొడిచాడు.
ముఖ్యంగా 6ఏళ్ల చిన్నారిని కత్తితో దాదాపు 26సార్లు పాశవికంగా కత్తితో పొడిచాడు. దీంతో ఆ బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు.
అతని 36ఏళ్ల తల్లి, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని ఇల్లినాయిస్‌లోని విల్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం వెల్లడించింది.
అమెరికా
ఘటనను ఖండించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్
దాడి సమయంలో బాలుడి తల్లి 911కి కాల్ చేసింది. దీంతో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపు, తల్లి, కొడుకులు బెడ్‌రూమ్‌లో వారి ఛాతీ, మెడ భాగాలపై అనేక కత్తిపోట్లతో పడి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
శవపరీక్ష సమయంలో బాలుడి పొత్తికడుపులో ఏడు అంగుళాల కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
అలాగే తల్లి, కొడుకులను జుబా పొడిచే సమయంలో అతను ముస్లింలు అందరూ చనిపోవాలని అన్నట్లు కౌన్సిల్ ఆన్ అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్ చికాగో కార్యాలయం చీఫ్ అహ్మద్ రెహాబ్ వెల్లడించారు.
ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. బాలుడిని చంపడాన్ని ద్వేషపూరితమైన చర్యగా అభివర్ణించారు.