Page Loader
USA: సముద్రంలో పడిన యుద్ధవిమానం.. ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌పై లాగుతుండగా ప్రమాదం..! 
సముద్రంలో పడిన యుద్ధవిమానం.. ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌పై లాగుతుండగా ప్రమాదం..!

USA: సముద్రంలో పడిన యుద్ధవిమానం.. ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌పై లాగుతుండగా ప్రమాదం..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 29, 2025
09:38 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాకు చెందిన యుద్ధ విమానం ఒకటి పొరపాటున ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌పై నుంచి సముద్రంలోకి పడిపోయింది. ఈ సంఘటన యూఎస్‌ఎస్‌ హ్యారీ ట్రూమన్‌ అనే విమాన వాహక నౌకపై చోటు చేసుకుంది. ఎఫ్/ఎ-18 ఫైటర్ జెట్‌ను హ్యాంగర్ బేకు తరలించేందుకు ట్రాక్టర్ సాయంతో లాకుస్తుండగా,విమానం అదుపు తప్పి నేరుగా సముద్రంలోకి జారిపోయింది. ఈ ప్రమాదంలో విమానాన్ని లాకుస్తున్న ట్రాక్టర్ కూడా డెక్‌పై నుంచి నీటిలోకి జారిపోయింది. ట్రాక్టర్‌ను సముద్రంలో పడిపోకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ,వారు విజయవంతం కాలేకపోయారు. ఈ సంఘటనలో ఓ నౌకాదళ సైనికుడు స్వల్ప గాయాలపాలయ్యాడని అమెరికా నౌకాదళ అధికారులు ప్రకటించారు. నీటిలో పడిపోయిన ఫైటర్ జెట్‌ విలువ సుమారుగా 68మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేయబడింది. ఈప్రమాదంపై నౌకాదళం ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది.

వివరాలు 

రెండు అమెరికా యుద్ధ నౌకల్లో ట్రూమన్‌ ఒకటి 

గత ఆరు నెలల్లో ఇదే యూఎస్‌ఎస్‌ హ్యారీ ట్రూమన్‌ నౌకపై నుంచి ప్రమాదవశాత్తూ కూలిపోయిన రెండో ఫైటర్ జెట్‌ ఇదే కావడం గమనార్హం. గతంలో ఒక ఫైటర్ జెట్‌ యూఎస్‌ఎస్‌ గెట్స్‌బర్గ్‌ అనే నౌక ద్వారా, అనుకోకుండా కూల్చివేయబడింది. అయితే ఆ సమయంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడగలిగారు. ప్రస్తుతానికి, పశ్చిమాసియా ప్రాంతంలో హూతీలపై దాడులు నిర్వహిస్తున్న రెండు అమెరికా యుద్ధ నౌకల్లో ట్రూమన్‌ కూడా ఒకటిగా పనిచేస్తోంది.