Strait of Hormuz: హార్ముజ్ జలసంధిలో ఇరాన్ క్షిపణి దాడి.. 8 మంది అమెరికా మెరైన్లకు గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
హార్ముజ్ జలసంధిలో అమెరికా దళాలు ప్రయాణిస్తున్న నౌకపై ఇరాన్ యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణితో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ఎనిమిది మంది అమెరికా మెరైన్లు గాయపడ్డారు. సెప్టెంబర్ 14న జరిగిన ఈ దాడిలో వారికి తీవ్ర గాయాలు కాలేదని, అయితే పొగ పీల్చడం, తలకు గాయాలయ్యే అవకాశం వంటి సమస్యలు ఎదురైనట్లు అమెరికా అధికారులు తెలిపినట్లు ఎన్బీసీ న్యూస్ వెల్లడించింది. తలనొప్పి సహా కంకషన్ లక్షణాలు కూడా కనిపించినట్లు అధికారులు పేర్కొన్నారు. గాయపడిన ఎనిమిది మందిలో ఏడుగురు మెరైన్లు సిబ్బంది కాగా.. మరొకరు అధికారి. వీరంతా బెటాలియన్ ల్యాండింగ్ టీమ్‌లో భాగంగా పనిచేస్తున్నారు. క్షిపణి దాడి జరిగిన నౌక అమెరికా నేవీకి చెందినది కాదని అధికారులు స్పష్టం చేశారు.
వివరాలు
అమెరికా సైనికుల గాయాల సంఖ్యలో పెరుగుదల
అయితే ఆ నౌక ఏ రకానికి చెందిందనే వివరాలను వెల్లడించలేదు.
దానిని కేవలం సముద్ర నౌకగా మాత్రమే పేర్కొన్నారు. దాడి జరిగిన కొద్దిసేపటికే గాయపడిన మెరైన్లంతా తిరిగి విధుల్లో చేరినట్లు అధికారులు తెలిపారు.
ఇరాన్‌తో జరుగుతున్న ఘర్షణలో గాయపడిన అమెరికా సైనికుల సంఖ్యపై పెంటగాన్ గత కొన్ని నెలలుగా విమర్శలు ఎదుర్కొంటోంది.
తాజాగా అమెరికా రక్షణ శాఖకు చెందిన డిఫెన్స్ క్యాజువాల్టీ అనాలిసిస్ సిస్టమ్ (DCAS)లో గాయపడిన సైనికుల జాబితాలో కొత్తగా 37 మందిని చేర్చారు.
ఇందులో 29 మంది నేవీ సిబ్బంది, ఎనిమిది మంది మెరైన్లు ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం ఇరాన్ ఘర్షణకు సంబంధించి గాయపడిన అమెరికా సైనికుల సంఖ్య 861కి చేరింది.
వివరాలు
అమెరికా సైనికుల గాయాల సంఖ్యలో పెరుగుదల
అయితే తాజాగా చేర్చిన 37 మంది ఎప్పుడు, ఎలా గాయపడ్డారనే వివరాలను పెంటగాన్ బహిరంగంగా వెల్లడించలేదు.
సైనికుల గాయాలకు సంబంధించిన వివరాలు నమోదు కావడంలో కొన్ని సందర్భాల్లో ఆలస్యం జరుగుతుందని అమెరికా రక్షణ అధికారులు గతంలో తెలిపారు.
ముఖ్యంగా కంకషన్, మెదడుకు సంబంధించిన గాయాల లక్షణాలు వెంటనే బయటపడకపోవడం వల్ల వివరాల నమోదులో జాప్యం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.