England: పావురాలకు ఆహారం ఇచ్చినందుకు.. మహిళకు రూ.2.5 లక్షల జరిమానా
అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదంటారు. అలాంటిది ఆహారం కావాలని నోరు తెరచి అడగలేని పక్షులకు ఆహారం అందిస్తోంది ఓ పక్షి ప్రేమికురాలు. చాలా మంది తమ ఇంటి పైకప్పు మీద లేదా ఇంటి బయట కూడా పావురాలకు ఆహారం అందించడం మీరు చూసి ఉంటారు. కానీ, ఇలా ఆహారం అందించినందుకు గాను జరిమానా విధించడం గురించి మీరు విన్నారా. ఇంగ్లండ్ లోని ఒక మహిళకు ఇలాంటి ఘటనే ఎదురైంది. తన ఇంటి తోటలో పక్షులకు ఆహారం పెట్టినందుకు మున్సిపాలిటీ ఆమెకు లక్షల రూపాయల జరిమానా విధించింది. వాస్తవానికి,ఈ ప్రాంతంలో పావురాలను,సిగల్‌లను పిలిపించి వాటికి ఆహారం ఇస్తున్నారని వృద్ధ మహిళపై పొరుగువారు మున్సిపాలిటీకి ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం గత సంవత్సరం ప్రారంభమైంది.
ఇంటి నుండి ఖాళీ చేయలని లేకపోతే కోర్టు చర్య తీసుకుంటామన్న మున్సిపాలిటీ
దీని తర్వాత మున్సిపాలిటీ ఆమెకి వ్రాతపూర్వక హెచ్చరిక జారీ చేసింది.ఇలా పక్షులకు ఆహరం ఇవ్వడం ఆపకపోతే, ఆమె కి £100 జరిమానా విధిస్తామని పేర్కొంది. అయితే,ఈహెచ్చరిక తర్వాత కూడా ఆ మహిళ పక్షులకు ఆహారం ఇవ్వడం ఆపలేదు.అటువంటి పరిస్థితిలో,మునిసిపాలిటీ ఆమె పై 2,500పౌండ్ల జరిమానా విధించింది. అంతేకాదు ఆమెని,ఆమె కొడుకును వారి స్వంత ఇంటి నుండి ఖాళీ చేయమని లేకపోతే కోర్టు చర్య తీసుకుంటానని బెదిరించింది. అన్నేరిటైర్డ్ సంగీత ఉపాధ్యాయురాలు. తన తోటలోకి వచ్చిన పక్షులను చూడడం అంటే ఆమెకు ఇష్టం. అయితే పక్షులు విరివిగా రావడంతో ఆ ప్రాంతం కలుషితమవుతోందని మున్సిపాలిటీ వారు అంటున్నారు. ఈ ప్రాంతంలో నివసించే వారు చాలా సమస్యలను ఎదుర్కొంటారు.అందువల్ల,మున్సిపాలిటీ మహిళను ఈ అలవాటును'సంఘ వ్యతిరేక ప్రవర్తన'గాపేర్కొంది.