LOADING...
JetBlue airline: న్యూయార్క్‌లో జెట్‌బ్లూ విమానాన్ని ఢీకొట్టిన డ్రోన్‌.. త్రుటిలో తప్పిన ప్రమాదం
త్రుటిలో తప్పిన ప్రమాదం

JetBlue airline: న్యూయార్క్‌లో జెట్‌బ్లూ విమానాన్ని ఢీకొట్టిన డ్రోన్‌.. త్రుటిలో తప్పిన ప్రమాదం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 30, 2026
11:49 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో ఓ భారీ విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న జెట్‌బ్లూ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానాన్ని న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్‌ ఢీకొట్టింది. లాస్‌ వెగాస్‌ నుంచి బయలుదేరిన ఈ విమానం సుమారు 3 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో మొత్తం 159 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. డ్రోన్‌ విమానం కాక్‌పిట్‌ వెలుపలి భాగాన్ని తాకినట్లు పైలట్‌ వెంటనే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ (ATC)కు సమాచారం అందించాడు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదని, విమానాన్ని సురక్షితంగా జేఎఫ్‌కే విమానాశ్రయంలో ల్యాండ్‌ చేసినట్లు జెట్‌బ్లూ ఎయిర్‌లైన్స్‌ వెల్లడించింది.

వివరాలు 

విమానాశ్రయ పరిసరాల్లో ప్రతి నెలా దాదాపు 100 డ్రోన్లు 

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FAA) దర్యాప్తు ప్రారంభించింది. విమానాశ్రయాల పరిసర ప్రాంతాల్లో ప్రతి నెలా దాదాపు 100 డ్రోన్లను గుర్తిస్తున్నామని అధికారులు తెలిపారు. నిషేధిత గగనతలంలో డ్రోన్లు ఎగరవేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారి డ్రోన్‌ లైసెన్స్‌ను రద్దు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తప్పవని ఎఫ్‌ఏఏ హెచ్చరించింది.

Advertisement