
కెనడాలో కూలిన విమానం.. ఇద్దరు భారత ట్రైనీ పైలట్లు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్లు మరణించినట్లు అధికారులు తెలిపారు.
మృతులను ముంబైకి చెందిన అభయ్ గాడ్రూ, యశ్ విజయ్ రాముగాడేగా గుర్తించారు.
పైపర్ పీఏ-34 సెనెకా అనే ట్విన్ ఇంజన్‌తో కూడిన విమానం చిల్లివాక్ నగరంలోని ఓ మోటెల్ వెనుక ఉన్న చెట్లు, పొదలపై కూలిపోయిందని కెనడా పోలీసు అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో భారతీయులే కాకుండా మరో పైలట్ కూడా చనిపోయాడు. అయితే ఈ ప్రమాదం వల్ల ఆ ప్రాంతంలో ప్రజలకు ఎటువంటి గాయాలు, ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు.
విమాన ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. కెనడా రవాణా భద్రతా బోర్డు ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మృతులు ముంబై వాసులుగా గుర్తింపు
#Canada: 3 Including 2 #Indian Trainee Pilots Killed In #PlaneCrash Near #Vancouverhttps://t.co/PoQAVhJ7Sc
— Free Press Journal (@fpjindia) October 7, 2023