Page Loader
Athens: గ్రీక్ షిప్పింగ్ కంపెనీలో కాల్పులు.. ఒకరు మృతి 
Athens: గ్రీక్ షిప్పింగ్ కంపెనీలో కాల్పులు.. ఒకరు మృతి

Athens: గ్రీక్ షిప్పింగ్ కంపెనీలో కాల్పులు.. ఒకరు మృతి 

వ్రాసిన వారు Stalin
Feb 12, 2024
06:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

Greek Shipping Company: ఏథెన్స్‌లోని గ్రీకు షిప్పింగ్ కంపెనీలో సోమవారం కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. ఇద్దరు గాయపడినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. షిప్పింగ్ కంపెనీలో తుపాకీ కాల్పులు జరడం చాలా అరుదు అని చెప్పాలి. కాల్పులకు పాల్పడిన వ్యక్తి షిప్పింగ్ కంపెనీలో మాజీ ఉద్యోగి అని తెలుస్తోంది. దుండగుడు భవనంలోకి ప్రవేశించి ఉద్యోగులపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వ్యక్తి షిప్పింగ్ కంపెనీ యజమానికి సంబంధించిన వ్యక్తిగా వెల్లడించారు. అయితే పోలీసులు కాల్పులు జరిగిన కంపెనీ పేరును అధికారికంగా వెల్లడించలేదు. ఇదిలా ఉంటే, కాల్పులు జరిగిన భవనం వెలుపల పోలీసులు అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్స్‌లను మోహరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాల్పుల్లో ఇద్దరికి గాయాలు