LOADING...
Trump: వెనెజువెలా తర్వాత మీరే.. ప్రత్యర్థి దేశాలకు ట్రంప్‌ వార్నింగ్
వెనెజువెలా తర్వాత మీరే.. ప్రత్యర్థి దేశాలకు ట్రంప్‌ వార్నింగ్

Trump: వెనెజువెలా తర్వాత మీరే.. ప్రత్యర్థి దేశాలకు ట్రంప్‌ వార్నింగ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 04, 2026
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్‌ మదురోను అమెరికా సైన్యం బంధించిన అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ లాటిన్‌ అమెరికా దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మెక్సికో, క్యూబా, కొలంబియా దేశాలు మాదకద్రవ్యాల తయారీకి కేంద్రాలుగా మారాయని, అక్కడ తయారవుతున్న డ్రగ్స్‌ అక్రమ మార్గాల్లో అమెరికాలోకి చేరుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ దేశాలు అనేక నేర ముఠాలకు ఆశ్రయం ఇస్తున్నాయని కూడా విమర్శించారు. ఇప్పటికైనా తమ వైఖరిని మార్చుకోకపోతే వెనెజువెలా ఎదుర్కొన్న పరిస్థితినే ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్‌ హెచ్చరించారు.

Details

ఆయా దేశాల్లో డ్రగ్స్‌ తయారుచేసే ప్రయోగశాలలపై దాడులు

మాదకద్రవ్యాల నిర్మూలన చర్యల్లో భాగంగా ఆయా దేశాల్లో డ్రగ్స్‌ తయారుచేసే ప్రయోగశాలలపై దాడులు చేయడానికి కూడా వెనుకాడబోమని ట్రంప్‌ స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ స్పందిస్తూ.. ఇతర దేశాల నుంచి అమెరికాకు వస్తున్న డ్రగ్స్‌ను పూర్తిగా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ క్రమంలో వెనెజువెలా తర్వాత క్యూబా, కొలంబియా వంటి దేశాలపైనా దృష్టి సారించే అవకాశం ఉందని తెలిపారు.

Details

తాము అప్రమత్తమంగా ఉన్నాం : కొలంబియా

అమెరికా చర్యలపై క్యూబా, కొలంబియా, మెక్సికో దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. వెనెజువెలా అధ్యక్షుడిని బంధించడం, ఆ దేశంపై యూఎస్‌ చేసిన దాడులు దురాక్రమణ చర్యలుగానే భావించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. ట్రంప్‌ చర్యల నేపథ్యంలో తాము అప్రమత్తమయ్యామని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తెలిపారు. వెనెజువెలా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పరిణామాలపై చర్చించేందుకు ఓఏఎస్‌ (ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్‌), ఐక్యరాజ్య సమితి వెంటనే సమావేశం కావాలని ఆయా దేశాలు డిమాండ్‌ చేశాయి.

Advertisement