Iran War: ఇరాన్‌పై భీకర వైమానిక దాడులు.. 13 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌పై సోమవారం తెల్లవారుజామున తీవ్ర వైమానిక దాడులు జరిగాయి. బహ్రెస్థాన్ ప్రాంతంలోని ఒక నివాస భవనాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అలాగే రాజధాని టెహ్రాన్‌లోని షరీఫ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ పరిసరాల్లో కూడా దాడులు జరిగినట్లు సమాచారం. ఈ దాడుల్లో భాగంగా క్యాంపస్ సమీపంలో ఉన్న సహజ వాయువు సరఫరా పైపులైన్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలపై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
షరీఫ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ పరిసరాల్లో కూడా దాడులు
‼️ NEW:
— Mossad Commentary (@MOSSADil) April 6, 2026
Government sources released footage from Azadi Street in Tehran showing the aftermath of the attack.
Witnesses say the blast was linked to a gas pipeline at Sharif University of Technology, with authorities confirming the situation was contained after the gas was shut… https://t.co/DYbfiHkdKz pic.twitter.com/aMab6DC4Rn