LOADING...
Jeffrey Epstein: జెఫ్రీ ఎప్స్టీన్ ఆత్మహత్య నోట్ బయటపెట్టిన కోర్టు
జెఫ్రీ ఎప్స్టీన్ ఆత్మహత్య నోట్ బయటపెట్టిన కోర్టు

Jeffrey Epstein: జెఫ్రీ ఎప్స్టీన్ ఆత్మహత్య నోట్ బయటపెట్టిన కోర్టు

వ్రాసిన వారు Sirish Praharaju
May 07, 2026
12:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో వివాదాస్పద వ్యక్తిగా పేరొందిన జెఫ్రీ ఎప్స్టీన్(Jeffrey Epstein రాసినట్టు భావిస్తున్న ఆత్మహత్య నోట్‌ను ఫెడరల్ కోర్టు బయటపెట్టింది. ఈ నోట్‌ను అతని మాజీ సెల్‌మేట్ నికోలస్ టార్టగ్లియోన్(Nicholas Tartaglione)న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ కరెక్షనల్ సెంటర్‌లో కనుగొన్నారు. 2019 జూలైలో ఎప్స్టీన్ చేసిన విఫలమైన ఆత్మహత్య ప్రయత్నం తర్వాత ఈ నోట్ లభించింది. కొద్ది వారాలకే అతను జైలులో మృతి చెందాడు. సంతకం లేని ఈ నోట్‌లో "నన్ను నెలల తరబడి విచారించారు .. ఏమీ దొరకలేదు!!!... వీడ్కోలు చెప్పే సమయం మనమే ఎంచుకోవడం గొప్ప విషయం" వంటి వాక్యాలు ఉన్నాయి. ఈ నోట్ ఉనికి గురించి గత వారం ది న్యూయార్క్ టైమ్స్ కథనం వెలువరించడంతో కోర్టు దాన్ని బయటపెట్టింది.

వివరాలు 

సెల్‌లో స్పృహ కోల్పోయిన స్థితిలో ఎప్స్టీన్

టార్టాగ్లియోన్ చెప్పిన ప్రకారం, ఎప్స్టీన్ ఒకసారి జైలు సెల్‌లో స్పృహ కోల్పోయిన స్థితిలో కనిపించాడు. మొదట అతను తనపై దాడి చేశాడని ఎప్స్టీన్ ఆరోపించినా, తరువాత ఆ మాట వెనక్కి తీసుకున్నాడు. ఈ నోట్‌ను భవిష్యత్తులో వచ్చే ఆరోపణలకు సాక్ష్యంగా తన లాయర్లకు ఇచ్చినట్టు తెలుస్తోంది. అప్పీల్ కేసు సమయంలో ఇది రహస్యంగా ఉంచారు. అయితే ఈ నోట్ విషయాలను టార్టాగ్లియోన్ ఇప్పటికే పబ్లిక్‌గా చెప్పినందున రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని న్యూయార్క్ టైమ్స్ కోర్టులో వాదించింది.

వివరాలు 

జైలులో ఆత్మహత్య చేసుకున్న ఎప్స్టీన్

గత ఏడాది పాడ్‌కాస్ట్ లో కూడా ఈ విషయాన్ని అతను వెల్లడించాడు. 2019 ఆగస్టు 10న ఎప్స్టీన్ జైలులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. అయితే అతని శక్తివంతమైన వ్యక్తులతో ఉన్న సంబంధాల కారణంగా ఈ మరణంపై అనేక అనుమానాలు, కుట్ర సిద్ధాంతాలు ఇంకా కొనసాగుతున్నాయి. 2023లో టార్టాగ్లియోన్ కు వరుసగా నాలుగు జీవిత ఖైదు శిక్షలు విధించగా, ప్రస్తుతం అతని అప్పీల్ కోర్టులో పెండింగ్‌లో ఉంది.

Advertisement