NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / యూఎస్ పౌరసత్వ పరీక్షలో కీలక మార్పులు.. అమెరికాపై అవగాహన, ఆంగ్ల నైపుణ్యాలకు పెద్దపీట  
    తదుపరి వార్తా కథనం
    యూఎస్ పౌరసత్వ పరీక్షలో కీలక మార్పులు.. అమెరికాపై అవగాహన, ఆంగ్ల నైపుణ్యాలకు పెద్దపీట  
    అమెరికాపై అవగాహన, ఆంగ్ల నైపుణ్యాలకు పెద్దపీట

    యూఎస్ పౌరసత్వ పరీక్షలో కీలక మార్పులు.. అమెరికాపై అవగాహన, ఆంగ్ల నైపుణ్యాలకు పెద్దపీట  

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 06, 2023
    09:55 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అగ్రరాజ్యం అమెరికా దేశ పౌరసత్వం పొందడం అంత ఈజీ కాదు. ఇకపై నిబంధనలు మరింత కఠినతరం చేయనున్నారు. ఈ మేరకు నేచురలైజేషన్ పరీక్షలో యూఎస్ఏ కీలక మార్పులు చేయనుంది.

    విదేశీయులకు అగ్రదేశ పౌరసత్వం ఇచ్చేందుకు నేచురలైజేషన్ టెస్ట్ నిర్వహిస్తారు.

    చివరిసారిగా 2008లో ఈ పరీక్షలో మార్పులు చేర్పులు చేశారు. అమెరికా చట్టాల ప్రకారం ప్రతి 15 ఏళ్లకు ఓసారి కాలానికి అనుగుణంగా మార్పులు జరగాల్సిందే.

    ఈ క్రమంలోనే మరోసారి పరీక్ష నిర్వహణ తీరులో కొత్త నిబంధనలు చేర్చేందుకు యూఎస్ సర్కార్ సన్నద్ధమవుతోంది.

    అభ్యర్థుల ఆంగ్ల భాష నైపుణ్యాలను అంచనా వేసేలా ఈ పరీక్ష కఠినతరంగా మారబోతోందని అక్కడి నిపుణులు అంచనా వేస్తున్నారు.

    DETAILS

    అమెరికాలో జీవితానికి సంబంధించి పలు ప్రశ్నలు అడిగే అవకాశం

    అమెరికా పౌరసత్వ ప్రక్రియలో నేచురలైజేషన్ పరీక్ష తొలి అంకం. ఈ టెస్టు దాదాపు నెల రోజుల పాటు సాగుతుంది.

    ఇందులో ఉత్తీర్ణులైన వారికే పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే అర్హత ఉంటుంది. అమెరికా జీవితానికి, అక్కడి జీవన విధానానికి సంబంధించి పలు ప్రశ్నలపై అభ్యర్థులు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.

    కొత్త విధానంలో నిర్వహించనున్న పరీక్షలో ఫొటోలు ఇస్తారు. వాటిని గుర్తిస్తూ ఇంగ్లీష్ లో వివరణ ( డిస్క్రిప్షన్ ) రాయాల్సి ఉంటుంది. అయితే ఆంగ్ల భాషపై పట్టులేని వారికి ఈ విధానం ఇబ్బంది కలిగిస్తుందని తెలుస్తోంది.

    గతంలో అభ్యర్థులు మౌఖిక పద్ధతి (ఇంటర్వూ) ద్వారా సమాధానాలు ఇచ్చేవారు.

    DETAILS

    యూఎస్ ప్రజలు, నిపుణులు సలహాల సూచనల అనంతరం నూతన విధానంపై ప్రకటన

    తాజాగా చేపడుతున్న నూతన మార్పులు ఆఫ్రికన్ దేశాల వారికి ఆందోళన కలిగిస్తోంది. పరీక్షలో రోజువారీ కార్యకలాపాలు, వాతావరణం, ఆహారం లాంటి వాటి ఫోటోలు ఇస్తారు. వాటిని వివరిస్తూ ఇంగ్లీష్ లోనే సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.

    కొత్త విధానంలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలూ ఉండటంతో అమెరికా చరిత్ర, ఇతర సామాజిక అంశాలపై చక్కటి అవగాహన ఉండాలి.

    తాజాగా చేపట్టబోయే సవరణలతో వర్ధమాన దేశాలు, సంక్షుభిత ప్రాంతాల నుంచి అగ్రరాజ్యం అమెరికా ఆశ్రయం కోసం వస్తున్న వారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది.

    కొత్త పరీక్ష విధానంపై అమెరికా పౌరులు, నిపుణుల నుంచి సలహాలు, సూచనలను యూఎస్ సర్కార్ స్వీకరిస్తోంది. అనంతరం నూతన పరీక్ష విధానాన్ని ప్రకటించనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా
    జో బైడెన్

    తాజా

    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్

    అమెరికా

    అజిత్ దోవల్‌పై అమెరికా ప్రశంసలు; ఆయన 'అంతర్జాతీయ నిధి' అంటూ పొగడ్తలు  భారతదేశం
    భారత్‌లో వీలైనన్ని ఎక్కువ వీసాలను ప్రాసెస్ చేయడానికి కృషి చేస్తున్నాం: అమెరికా  వీసాలు
    'NMODI': కారు నంబర్ ప్లేట్‌పై మోదీ పేరు; అమెరికాలో ఓ భారతీయుడి వీరాభిమానం  నరేంద్ర మోదీ
    15 ఏళ్ల సీఈఓను బ్యాన్ చేసిన లింక్డ్‌ఇన్, కారణం ఇదే సోషల్ మీడియా

    జో బైడెన్

    'ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో ప్రధాని మోదీ నంబర్ 1' నరేంద్ర మోదీ
    'గూఢచారి' బెలూన్ శిథిలాలను చైనాకు అప్పగించేది లేదు: అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    అధ్యక్ష ఎన్నికల వేళ వైట్‌హౌస్ కీలక ప్రకటన- బైడెన్‌కు పూర్తిస్థాయి వైద్య పరీక్షలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    ఉక్రెయిన్‌కు రైలులో వచ్చిన బైడెన్: సినిమాను తలపించిన అమెరికా అధ్యక్షుడి రహస్య పర్యటన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025